చల్లంగ చూడు తల్లీ..


Fri,November 1, 2019 02:33 AM

జయశంకర్ భూపాలపల్లి కృష్ణకాలనీ/ ఏటూరునాగారం/ మంగపేట/ వెంకటాపూర్/ వాజేడు: చల్లంగ చూడు నా గమ్మ తల్లీ.. అంటూ భక్తులు వేడుకున్నారు. నాగులచవితిని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి, ములు గు జిల్లాల్లో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పుట్టల వద్దకు వెళ్లి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పసుపు, కుంకుమ చల్లి, పుట్టల్లో పాలు పోసి, పూలు, పండ్లు పెట్టి మొ క్కులు చెల్లించుకున్నారు. దోషాలను తొలగించాలని వేడుకున్నారు. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టారు. ఏటూరునాగారంతో పాటు మంగపేట మండలం రాజుపేటలోని నాగులమ్మ ఆలయంలో ఆలయ ప్రధాన పూజారులు బాడిన రామకృష్ణస్వామి, నాగ రమేశ్ ఆధ్వర్యంలో పూజలు జరిపించారు. నాగులమ్మ ఆలయ వడ్డెలు, పూజారులు, గిరిజన కుల పెద్దలు పాల్గొన్నారు. వెంకటాపూర్ మండల కేంద్రంలోని గుడియమ్మ, సీతారామాంజనేయస్వామి ఆలయంలో భక్తులు పూజలు, అభిషేకాలు చేశారు. వాజేడు మండలం ప్రగళ్లపల్లి, పేరూరు, ధర్మవరం గ్రామాల్లో పూజలు జరిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భక్తులు కారల్ మార్క్స్ కాలనీలోని శివాలయం, సింగరేణి గెస్ట్‌హౌస్ ఎదురుగా ఉన్న పుట్ట, కృష్ణకాలనీలోని మినీ ఫంక్షన్ హాలుకు ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ ఆలయం వద్ద పుట్ట వద్ద పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. కారల్ మార్క్స్‌కాలనీలోని షిరిడీ సాయిబాబా దేవాలయంలో పూజలు జరిగాయి.

27

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles