నవంబర్ 2న డివిజన్ స్థాయి క్రీడలు


Fri,November 1, 2019 02:33 AM

ఏటూరునాగారం, అక్టోబర్ 31: జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌లో చదువుతున్న 14, 17 ఏళ్ల బాల బాలికలకు నవంబర్ 2న డివిజన్ స్థాయి క్రీడలు నిర్వహించనున్నట్లు ఏటీడీవో నారాయణ, క్రీడల అధికారి వజ్జ నారాయణ తెలిపారు. ఈ మేరకు ఐటీడీఏ కార్యాలయం లో ఆయా ప్రాంతాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలతో గురువారం సమావేశం ఏర్పాటు చేశా రు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, చెస్, క్యారమ్స్, ఆర్చరీ, టెన్నీకాయిట్ క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. నవంబర్ 6న జోనల్ స్థాయి క్రీడలు నిర్వహిస్తామని తెలిపారు. రెండు జిల్లాలను నాలుగు డివిజన్లుగా విభజించామని వెల్లడించారు. ఏటూరునాగారం డివిజన్ కన్వీనర్‌గా చింత రమేశ్, ములుగు డివిజన్ కన్వీనర్‌గా యాలం ఆదినారాయణ, వాజేడు డివిజన్ కన్వీనర్‌గా ఇంజ సత్యారావు, భూపాలపల్లి డివిజన్ కన్వీనర్‌గా వట్టం శంకర్‌లను నియమించారు. సమావేశంలో పీడీ, పీఈటీలు గడ్డం లక్ష్మీనారాయణ, శరత్, కృష్ణ, వంక రాంచందర్, అశోక్‌కుమార్, శ్యామలత, పార్వతి, యశోధ, సాంబ య్య, వెంకటేశ్, గోపాల్, నాగేందర్, సుదర్శన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

32

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles