ములుగు జిల్లాలో పంట నష్టం పరిశీలన


Wed,October 23, 2019 01:30 AM

వెంకటాపురం(నూగూరు): మండలంలోని పంట నష్టాన్ని ఏటూరునాగారం ఏడీఏ శ్రీధర్‌, వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం పరిశీలించారు. భారీ వర్షాలు, ఈదురు గాలులకు సూరవీడు, ఏదిర గ్రామపంచాయతీ పరిధిలో దెబ్బతిన్న వరిని మంగళవారం పరిశీలించారు. పంట నష్టం వివరాలను నమోదు చేసుకున్నారు. వెంట ఏవో సుప్రజ్యోతి, బీటీఎం రామదాసు, ఇఫ్కో టోక్యో ఇన్స్యురెన్స్‌ మండల కో-ఆర్డినేటర్‌ యాదగిరి తదితరులున్నారు.


నష్టపోయిన రైతులకు పరిహారం
- జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌
ములుగు, నమస్తే తెలంగాణ: జిల్లాలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట తదితర మండలాల్లో భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించనున్నట్లు జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మిర్చి, వరి పంటలు పండించే రైతులు నష్టపోయినట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ విషయంపై కలెక్టర్‌ నారాయణరెడ్డిని ఫోన్‌లో సంప్రదించి పూర్తి వివరాలతో నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలని కోరినట్లు తెలిపారు. నష్టపోయిన పొలాల వద్దకు వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన బృందాలను పంపించి సర్వే నిర్వహించి నివేదిక అందిస్తామని కలెక్టర్‌ తెలిపారని వివరించారు. నివేదికను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి పంపించి నష్టపోయిన బాధితులందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకుం టామని జగదీశ్వర్‌ పేర్కొన్నారు.

52

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles