గలగలా పారుతున్న గణపసముద్రం


Tue,October 22, 2019 02:26 AM

గణపురం, అక్టోబర్ 21: వారం రోజులుగా కురుస్తున్న వరుస వర్షాలకు మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు పొంగి పొర్లుతున్నది. ఈసారి వర్షాకాల సీజన్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఇటీవల కురుస్తున్న వర్షాలకు 30 అడుగుల సామర్థ్యం ఉన్న గణసముద్రం పూర్తిగా నిండి ఒక అడుగు ఎత్తుతో అలుగు పోస్తూ జళకళతో సవ్వడి చేస్తున్నది. ఈ చెరువు ఒక్క సారి అలుగు పోయడం మొదలైతే నెల రోజులపాటు మత్తడి దూకుతూనే ఉంటుంది. ఏడాది కిందట ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రస్తుతం ఈ చెరువు మత్తడి తూకుతుండడంతో రైతులు, పలు గ్రామాల ప్రజల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. ఈ మేరకు వివిధ గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతులు, గ్రామస్తులు చెరువు వద్దకు సోమవారం పెద్ద సంఖ్యలో చేరుకొని అలుగును పరిశీలించారు. ఈ ఏడాది చెరువు నిండుతుందని అనుకోలేదని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదనీరు చేరి అలుగు పడుతుంటే ఆనందగా ఉందని పలువురు పేర్కొన్నారు. 30 అడుగుల ఎత్తు నుంచి మత్తడి నీరు జాలువారుతుండగా పర్యటకులు ఆ సుందర మనోహర దృశ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వెంట వెళ్తున్న ప్రయాణికులు వాహనాలను నిలిపి, గలగలా పారుతున్న మత్తడి నీటి వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.

73

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles