పారిశుధ్య పనులకు యంత్రాలు కొనుగోలు చేయాలి


Tue,October 22, 2019 02:25 AM

-కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు
జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్, అక్టోబర్ 21: గ్రామాల్లో శాశ్వతంగా పారిశుధ్య పనులు నిర్వహించేందుకు యంత్ర పరికరాలు కొనుగోలు చేయాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించా రు. గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్ల కొనుగోలుకు ఏర్పా టు చేసిన కమిటీ సభ్యుల(అధికారుల)తో కలెక్టరేట్‌లో ఆయన సోమవారం సమీక్షించారు. 30 రోజుల ప్రత్యే క కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారన్నారు. శాశ్వతంగా గ్రామాల్లో నీటి సరఫరా, మొక్కలకు నీరు పో సేందుకు ట్యాంకర్లు, చెత్తను తొలగించేందుకు డోజర్లు, చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేందుకు ట్రాక్టర్ ట్రాలీలు అవసరం అవుతాయన్నారు. జిల్లాలోని 241 గ్రామ పంచాయతీలకు ఆయా యంత్రాలు కొనుగోలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో కమిటీ సభ్యులైన డీపీవో చంద్రమౌళి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి సుమతి, జిల్లా వ్యవసాయ అధికారి సత్యంబాబు, పంచాయతీరాజ్ ఈఈ రాంబాబు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

61

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles