లక్ష్మీ బరాజ్‌లో నిలకడగా ప్రవాహం


Sat,October 19, 2019 03:01 AM

మహదేవపూర్, అక్టోబర్ 18: జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి పరిధిలో నిర్మించిన లక్ష్మీ (మేడిగడ్డ)బరాజ్‌లో నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. శుక్రవారం సైతం బరాజ్‌లో 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో ప్రాణహిత నది ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తోంది. ఆ జలాలు లక్ష్మీ బరాజ్‌కు చేరుతున్నాయి. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కొన్ని రోజులు నీటి ప్రవాహం పెరుగుతూ, మరికొన్ని రోజులు తగ్గుతూ వస్తున్నది. ఈ మేరకు అధికారులు ప్రవాహానికి అనుగుణంగా గేట్లను పెంచుతూ, తగ్గిస్తూ నీటిని దిగువకు తరలిస్తున్నారు. గురు, శుక్రవారాల్లో 3 గేట్ల నుంచి నీటిని తరలించారు. ప్రస్తుతం 95.6 మీటర్ల ఎత్తులో 5.474 టీఎంసీల నీరు బరాజ్‌లో నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బరాజ్‌లో 35 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 42 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

57

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles