రక్తదానం ప్రాణదానంతో సమానం


Sat,October 19, 2019 03:01 AM

-ఏటూరునాగారం సీఐ నాగబాబు
ఏటూరునాగారం, అక్టోబర్ 18 : రక్తదానం ప్రాణదానంతో సమానమని ఏటూరునాగారం సీఐ నాగబాబు అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలో భాగంగా శుక్రవారం ఏటూరునాగారం సబ్‌డివిజన్ పరిధిలోని ఆరు పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో ఏటూరునాగారంలో రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని ఎస్పీ ఆదేశాల మేరకు ఏటూరునాగారం ఏఎస్పీ సారధ్యంలో రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిబిరంలో ఆయా పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని యువకులతోపాటు పోలీసులు 153 యూనిట్ల రక్తాన్ని దానం చేయడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో వెంకటాపురం సీఐ శివప్రసాద్, ఎస్సైలు శ్రీకాంత్, వెంకటేశ్వర్‌రావు, సీఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఎంకే నాయుడు, పీఎస్సై తిరుపతిరావు, ములుగు జిల్లా రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యడు కొత్తపల్లి ప్రసాద్, సిబ్బంది, రక్తదాతలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

46

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles