పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం


Sat,October 19, 2019 03:00 AM

భూపాలపల్లి, నమస్తే తెలంగాణ : పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోవడమే కష్టమని అడిషనల్ ఎస్పీ బానోతు రాజమహేంద్రనాయక్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని జిల్లా ఆర్మ్ డ్ రిజర్వ్ (ఏఆర్) ప్రధాన కార్యాలయంలో ఏర్పా టు చేసిన ఓపెన్‌హౌస్ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో ప్రజలు, వి ద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అదన పు ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకొని ఉంటుందని, వారి త్యా గాలను ప్రజలు గుర్తించాలని, ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసులేనన్నారు.


సమాజం ప్రశాంతంగా ఉందంటే అది పో లీసుల సేవల వల్లేనని, ఇబ్బందికర పరిస్థితుల్లోనూ మొ క్కవోని ధైర్యంతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. పోలీసు విధులపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన పెంపొందించేందుకే ఓపెన్‌హౌజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమాని కి వచ్చిన విద్యార్థులకు స్వయంగా అదనపు ఎస్పీ రాజమహేంద్రనాయక్, వివిధ విభాగాల సిబ్బంది ఆయుధాలు, బాంబుస్కాడ్, కమ్యూనికేషన్ పరికరాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సదానందరెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు సంతోశ్‌కుమార్, సతీశ్, ఎంటీవో ధరణికుమార్, పోలీసుల అధికారుల సంఘం నేత శోభ న్, శిక్షణ ఆర్‌ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

63

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles