వేర్వేరు కారణాలతో ఐదుగురి మృతి


Fri,October 18, 2019 03:14 AM


మహదేవపూర్, అక్టోబర్ 17 : మండలకేంద్రంలోని టస్సర్ కాలనీకి చెందిన బిల్ల కీర్తన (6) విషజ్వరంతో మృతిచెందింది. ఈ సంఘటన గురువా రం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన బిల్ల శివ-తిరుపతమ్మ దంపతులకు కీర్తన రెండో సంతానం. స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ మహదేవపూర్‌లోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొం దుతూ పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందింది. కాగా చిన్నారి కుటుంబ సభ్యులను జెడ్పీటీసీ గుండాల అరుణ పరామర్శించి దహన సంస్కారాలకు రూ.2వేల ఆర్థికసాయాన్ని అందజేశారు.


శివ్వాపూర్‌లో బాలిక..
ఏటూరునాగారం : మండలంలోని శివ్వాపూర్ గ్రామానికి చెందిన నల్లతీగల రమేశ్ ఉమ దంపతుల కుమార్తె సహస్ర(8) జ్వరంతో బాధపడుతూ ఎంజీఎంలో చికిత్స పొందు తూ గురువా రం మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకా రం.. నాలుగు రోజుల క్రితం సహస్రకు జర్వం రావడంతో ఆమెను మండలకేంద్రంలోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను మూడు రోజుల క్రితం ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యా హ్నం మృతి చెందింది. మృతురాలు అదే గ్రామం లో రెండో తరగతి చదువుతున్నది.

వృద్ధురాలి ఆత్మహత్య
గణపురం : పురుగుల మందు తాగి ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని నగరంపల్లిలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై వాడిచర్ల గోవర్ధన్ కథనం ప్రకారం.. నగరంపల్లి గ్రామానికి చెందిన బూక్య ఐలమ్మ(70) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. ఇద్దరు కొడుకులు ఉన్నా తన ఆలనాపాలనా చూసుకునే వారు లేకపోవడంతో మనస్థాపం చెందిన ఐలమ్మ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అప్పుల బాధతో పత్తి రైతు..
కాటారం : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గజ్జెల రాజబాబు (45) తనకున్న ఐదెకరాల భూమిలో రెండేళ్లుగా పత్తి సాగు చేస్తున్నాడు. గతేడాది పత్తి పంట సాగు చేయగా, ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో పాటు ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో పంట సాగు కోసం రూ.2లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పులు భారం కావడంతో గురువారం తెల్లవారుజామున రాజబాబు విష గుళికలు మింగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటినా మహదేవపూర్ దవాఖానకు తరలిస్తుండగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జహీర్‌ఖాన్ తెలిపారు.

పాము కాటుతో చిన్నారి మృతి
కాటారం : మండలంలోని దామెరకుంట గ్రా మానికి చెందిన తొమ్మిదేండ్ల చిన్నారి పాము కాటుతో గురువారం మృతి చెందిం ది. స్థానికుల కథనం ప్రకారం.. దామెరకుంటకు గ్రామానికి చెంది న అరిగెల మాధవి, ప్రమోద్‌ల కూతు రు ప్రణవి (09) వారి ఇంట్లోని కిరాణం షాపులో ఆడుకుంటుంది. కాగా ఆమెను ప్రమాదవశాత్తు పాము కాటు వేసింది. అధిక రక్తం కారడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మహాదేవపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రణవి పరిస్థితి విషమించడంతో వైద్యులు వరంగల్ తీసుకెళ్లాలని సూచించగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

69

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles