పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని, వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉం దని భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ రాజమహేంద్రనాయక్ అన్నారు. గు రువారం అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి హాజరైన ఏఎస్పీ మా ట్లాడుతూ పోలీసులు అందిస్తున్న సేవలకు గుర్తిం పు ఉన్నాలేకున్నా పోలీసులు మాత్రం ప్రజల రక్షణ కోసం తమ ప్రా ణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారన్నారు. వివిధ కారణాలతో రోజుకు వందలాది మందికి రక్తం అవసరం ఉంటుందని, ఆరోగ్యంగా ఉన్న ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. రక్తదాన శిబిరంలో 400మంది దాతల నుంచి 375యూనిట్ల రక్తం సేకరించి వరంగల్ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి అప్పగించినట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుకు పోలీసుశాఖ తరుపున అడిషనల్ ఎస్పీ రాజమహేంద్రనాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ సదానందరెడ్డి, భూపాలపల్లి డీఎస్పీ కిరణ్‌కుమార్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ పాలకవర్గ సభ్యులు డాక్టర్ కాశెట్టి శ్రీనివాస్, జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.