12వ రోజు సాఫీగా ప్రయాణం


Thu,October 17, 2019 03:27 AM

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 16: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12వ రోజు బస్సులు యధావిధిగా నడిచాయి. సమ్మె ప్రభావం ఎక్కడా కనిపించలేదు. బుధవారం 55 ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. జిల్లాలోని ప్రధాన సెంటర్లకు బస్సులు కొనసాగాయి. నిన్నటి వరకు మాన్యువల్ టిక్కెట్లు, టిక్కెట్లు లేకుండా నడిపిన అధికారులు.. బుధవారం 10 టిమ్ మిషన్లతో బస్సులు నడిపించారు. టిమ్ మిషన్లపై తాత్కాలిక కండక్టర్లకు శిక్షణ ఇచ్చిన అధికారులు.. వారికి మిషన్లు అందజేసి రూట్లలో పంపారు. గురువారం నుంచి పూర్తిస్థాయిలో టిమ్ మిషన్లను కండక్టర్లకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డిపో వద్ద, బస్టాండ్‌లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు
వెంకటాపురం(నూగూరు), అక్టోబర్ 16: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయవద్దని స్టేట్ విజిలెన్స్ అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ వరప్రసాద్ సూచించారు. వెంకటాపురం మండలంలో ఆయన బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు వాహనాలు, ఆటోలు, ప్రైవేట్, ఆర్టీసీ బస్సులను తనిఖీ చేశారు. ప్రయాణికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సమ్మె నేపథ్యంలో ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. అధిక చార్జీలు వసూలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


.

48

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles