ప్రభుత్వ భూములను పరిశీలించిన కలెక్టర్ నారాయణరెడ్డి


Thu,October 17, 2019 03:26 AM

గోవిందరావుపేట, అక్టోబర్16: చల్వాయి శివారు గౌరారం చెరు వు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. 19వ సర్వే నంబర్‌లో ఉన్న సుమారు 1500 ఎకరాల భూమిపై అటు అటవీశాఖ, ఇటు రెవెన్యూ శాఖ మధ్య కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతున్నది. ఈ క్రమంలో కలెక్టర్ స్వయంగా ఆ భూములను పరిశీలించారు. ఫారెస్టు, రెవెన్యూ శాఖ అధికారులను ప్రభుత్వ భూముల వద్దకు పిలిపించి ఇరువురి వద్ద ఉన్న డాక్యూమెంట్లను క్షుణ్ణంగా చూశారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారుల వద్ద ఉన్న పూర్తి స్థాయి పత్రాలను వారం లోపు సూచించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డిప్యూటీ త హసీల్దార్ సపుజుల్‌హుస్సేన్, ఎఫ్‌ఆర్వో మాధవిశీతల్, ఆర్‌ఐ చీమానాయక్, వీఆర్వోలు షరీఫా, విజయలక్ష్మి ఉన్నారు.

44

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles