యాసంగికి ప్రణాళిక


Wed,October 16, 2019 01:41 AM

జయశంకర్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యాసంగి వ్యవసాయ ప్రణాళికలను వ్యవసాయశాఖ ఖరారు చేసింది. జిల్లా వ్యాప్తం గా నీటి వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. దీంతో గత యాసంగి కన్నా సాగు విస్తీర్ణం ఈసారి పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. దానికి అనుగుణంగా యాసంగిలో రైతులు వేసే పంట విత్తనాలను, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ మాసం నుంచే యాసంగి పంటకాలం మొదలవుతుంది. దీంతో అధికారులు ప్రణాళికను రూపొందించి ఈ నివేదికలను ప్రభుత్వానికి పంపించారు. దీనికి అనుగుణంగా కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. జిల్లాలో 2018-19 యా సంగిలో అన్ని రకా ల పంటలు కలిపి 20,576హెక్టార్ల విస్తీర్ణంలో సాగు కాగా, ఈ యాసంగి 2019-2020లో 22,741 హెక్టార్లలో 17రకాల పంటలు సాగు అవుతాయని అధికారులు ఈ ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా విత్తనాలను అందుబాటులో ఉంచాలని కూడా నిర్ణయించారు. ఈ వానాకాలంలో ప్ర ధానంగా పెసరు, శెనగలు, వేరుశెనగలు, పొద్దుతిరుగుడు, మొ క్కజొన్న, మినుము, జొన్న, నువ్వులు, జీలుగులు, వరి తదితర పంటలు సాగు అవుతాయని అధికారులు తమ అంచనా ల్లో పేర్కొన్నారు. ఈసారి అన్ని రకాల విత్తనాలు కలిపి జిల్లాలో సుమారు 5780క్వింటాళ్ల విత్తనాలు అవసరం పడుతాయ ని పేర్కొన్నారు. రాయితీ విత్తనాలను కూడా ఈసారి అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయశాఖ తన ప్రణాళికలను తయా రు చేసింది. ఈ యాసంగిలో అవసరమయ్యే యూరియా, డీఏపీ కాంప్లెక్స్ ఎరువులను కూడా వానాకాలంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని యాసంగిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అందించాలని యోచిస్తున్నది. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచితే రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని భావించిన వ్యవసాయ శాఖ యాసంగి కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా ఖరారు చేసింది. ఎక్కడ కూడా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం సమీక్షలు నిర్వహించింది. అదేవిధంగా క్షేత్రస్థాయి నుంచి ప్రతిపాదనలను తెప్పించి అవసరానికి అనుగుణంగా యాసంగి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. ఈ సారి ఆలస్యంగా వర్షాలు కురిసినా అనుకున్న స్థాయిలో కురవడం, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వానాకాలంలో మంచి దిగుబడులు రావడం, జిల్లా వ్యాప్తంగా నీటి నిల్వలు అందుబాటులో ఉండటంతో యాసంగిలో సాగు విస్తీర్ణం 2వేల హెక్టార్లకు పైగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

52

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles