వెట్టి జీవితాల్లో వెలుగు


Wed,October 16, 2019 01:39 AM

కాటారం/ టేకుమట్ల/ పలిమెల, అక్టోబర్ 15: సీమాంధ్ర పాలనలో ఉద్యోగ భద్రత లేకుండా, చాలీచాలని వేతనాలతో వెట్టి పనులు చేస్తున్న కార్మికుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని గ్రామ పంచాయతీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. వారి నెలవారీ వేతనాలను రూ. 8500లకు పెంచుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 51ని సోమవారం జారీ చేయడంపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పలు గ్రామాల్లో కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. పారిశుధ్య కార్మికులతో పాటు పంచాయతీల్లో వివిధ పనులు చేస్తున్న కార్మికులకు వేతనాలు నెలకు రూ.8500కు పెంచుతూ జీవో విడుదల చేయడంపై కాటారం గ్రామపంచాయతీ, చిదినెపల్లి పంచాయతీల్లో సీఎం కేసీఆర్ ప్లెక్సీలకు కార్మికులు మంగళవారం క్షీరాభిషేకం చేశారు. సర్పంచ్‌లు తోట రాధమ్మ, అంతర్గాం రాజమౌళి, ఎంపీటీసీ తోట జనార్దన్, ఉప సర్పంచ్ నాయిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్మికులు పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ తమ కష్టాన్ని గుర్తించి జీతాలు పెంచిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిధులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు గోనె శ్రీనివాస్, గౌరక్క, పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దోమల శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు. తమ ఆరోగ్యం పాడైనా పట్టించుకోకుండా, ప్రజా ఆరోగ్య పరిరక్షణయే ధ్యేయంగా వెట్టి చాకిరీ చేస్తున్న జీపీ కార్మికుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని జీపీ సిబ్బంది(వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్) మండలాధ్యక్షుడు మార్క శరత్‌బాబు గౌడ్ పేర్కొన్నాడు. గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బంది వేతనాన్ని రూ. 8500కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేయడాన్ని హర్షిస్తూ టేకుమట్ల మండల కేంద్రంలో జీపీ సిబ్బంది( వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్) నాయకులు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శరత్‌బాబు గౌడ్ మాట్లాడుతూ చాలీచాలని వేతనంతో గ్రామాల్లో పరిశుభ్రతకు పాటుపడుతున్న కార్మికుల శ్రమని, కష్టాన్ని ఇన్ని రోజులు ఏ ప్రభుత్వమూ గుర్తించలేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో సమస్యలపై ఉన్న అవగాహనతో జీపీ సిబ్బంది వేతనాలను పెంచారని కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు కత్తి సంపత్, గునిగంటి మహేందర్, కార్మికులు తోట సాగర్, రవీందర్, ప్రభాకర్‌రెడ్డి, మురళీ మోహన్, రవి, బుచ్చిరెడ్డి, సమ్మక్క, మల్లయ్య, సారయ్య, ఆదాం, ఆనం ద్, మొండయ్య, సతీశ్, రాములు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచు తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పలిమెల మండలంలోని కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గ్రామాల్లో అనేక ఏళ్లుగా చాలీ చాలని వేతనాలతో పనులు చేశామని, తెలంగాణ ప్రభుత్వం సిబ్బందికి వేతనాలు రూ.8,500కు పెంచడంతో తమ కుటుంబాల్లో వెలుగులు నిండాయని పలువురు పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో అటెండర్లు, బిల్ కలెక్టర్లు, కంప్యూటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, హెల్పరు,్ల కారోబార్లు, పంప్ ఆపరేటర్లు, మోటర్ మెకానిక్‌లు, పార్ట్‌టైం క్లర్కులు, పంప్ డ్రైవర్లు, సఫాయిలు, స్వీపర్లు, వాటర్ ప్లాంట్ ఆపరేటర్లు, వాటర్‌మెన్లు తదితరులు పాల్గొన్నారు.

59

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles