మాణిక్యరావు మృతిపై వీడిన మిస్టరీ


Wed,October 16, 2019 01:38 AM

గోవిందరావుపేట, అక్టోబర్ 15 : మండలంలోని మొద్దులగూడెం సమీపంలోని తోగుఒర్రె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మిస్టరీ వీడింది. గత నెల 18న జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న మాణిక్యరావు మృతి చెందిన విషయం విదితమే. కాగా, మాణిక్యరావు బైక్‌ను అటవీ శాఖ వాహనం ఢీకొట్టిందని అతడి బంధువులు పస్రాలోని ఫారెస్టు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి నిజాలను తెలుసుకునేందుకు ఎస్సై మహేందర్‌కుమార్ దర్యాప్తు ప్రారంభించారు. మాణిక్యరావు మృతికి అసలు కారకుడిని పట్టుకున్నారు. మంగళవారం ఎస్సై వివరాలను వెల్లడించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి టాటా ఏసీ వాహనం ఢీకొట్టినట్లు గుర్తించామని, కానీ డ్రైవర్ పరారీలో ఉండటంతో ఆ విషయం వెలుగులోకి రాలేదన్నారు. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన అపరిచింతల మహేశ్ అల్లిగూడెంలోని డబుల్ బెడ్‌రూం ఇండ్లకు తలుపులు తీసుకువచ్చి అక్కడ దించి మళ్లీ పస్రాలోకి తిరిగి వెళ్తున్న క్రమంలో మాణిక్యరావు బైక్‌ను ఢీకొట్టడన్నారు. దీంతో మాణిక్యరావు అక్కడిక్కడే మృతి చెందాడన్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి డ్రైవర్ మహేశ్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు పంపినట్లు ఆయన వివరించారు.

45

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles