అంగన్‌వాడీ సెంటర్‌కు పాడైన గుడ్ల సరఫరా


Wed,October 16, 2019 01:37 AM

-కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు
ములుగురూరల్, అక్టోబర్ 15 : ములుగు జిల్లా పరిధిలోని దేవగిరిపట్నం అంగన్‌వాడీ సెంటర్‌కు కాంట్రాక్టర్ పాడైపోయిన గుడ్లను సరఫరా చేసిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్‌లో కొన్ని రోజుల క్రితం గుడ్లను సరఫరా చేసి కాంట్రాక్టర్ బయోమెట్రిక్ తీసుకున్నాడు. కాగా, మురిగిపోయిన గుడ్లను సరఫరా చేశాడు. వాటిని లబ్ధిదారులకు అందించగా వారు పరిశీలించి గుడ్లు మురిగిపోయాయని చెప్పారు. కాగా, ఈ విషయమై అంగన్‌వాడీ సెంటర్ టీచర్, ఆయాను వివరణ కోరగా గుడ్లను కాంట్రాక్టర్ ఇష్టం వచ్చిన సమయంలో సరఫరా చేస్తున్నారన్నారు. సెంటర్ నడిచే సమయంలో కాకుండా సెలవుల రోజు లేదా ఉదయం 7 నుంచి 8గంటల సమయంలో వచ్చి మొదట బయోమెట్రిక్ తీసుకొని గుడ్లను పరిశీలించే అవకాశం ఇవ్వకుండా పెట్టి వెళ్తున్నారని ఆరోపించారు. మురిగిపోయిన గుడ్లు వస్తున్నాయని సరఫరా చేసే వారిని అడిగితే దబాయిస్తున్నారని తెలిపారు. కాగా, ప్రభుత్వం అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారంతోపాటు గుడ్లను అందిస్తుందని, ఇలాంటి నిర్లక్ష్యపు కాంట్రాక్టర్ మూలంగా పౌష్టికాహారం విషయంలో తప్పుడు ఆరోపణలు వచ్చే అవకాశం ఉందని, ఉన్నతాధికారులు స్పందించి కాంట్రాక్టర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

39

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles