కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం


Mon,October 14, 2019 03:51 AM

-ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం
-విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర స్వామ-లక్ష్మీ పంప్‌హౌజ్, బరాజ్ సందర్శన
-ఆలయంలో పూజల గోదావరి మాతకు వాయినం


మహదేవపూర్/కాళేశ్వరం, అక్టోబర్ 13 : రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని విశాఖ శారద పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి వారు అన్నారు. ఆదివారం ఆయన లక్ష్మీ(కన్నెపల్లి)పంప్‌హౌస్, లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్‌లను సందర్శించారు. స్వామి వారు ముం దుగా కాళేశ్వరంలోని ముక్తీశ్వరస్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి లక్ష్మీ పంప్‌హౌస్ సందర్శణకు వెళ్లారు. అక్కడ ప్రాజెక్టు ఈఈ రమణారెడ్డి స్వామి వారికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి వ్యూపాయింట్ వద్దకు చేరుకొని పంపుహౌస్‌ను సందర్శించిన అనంతరం స్వామివారికి మ్యాపు ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా పంపుహౌస్ వద్ద పని చేస్తున్న మోటర్ల వివరాలు, వాటి పనితీరును వివరించారు. పంప్‌హౌస్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా 13.02కిలోమీటర్ల వరకు నీరు ప్రవహించి సరస్వతీబరాజ్‌లో కలుస్తాయని తెలిపారు. లక్ష్మీబరాజ్(మేడిగడ్డ)కు చేరుకుని బరాజ్ హోమశాల వ్యూ పాయింట్ వద్ద గోదావరి మాతకు పట్టుచీర, పూలు, పండ్లు, కుంకుమ సమర్పించారు. అనంతరం స్వామి వారు మాట్లాడుతూ ఇంత తక్కువ సమయంలో పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు అద్భుతమని అన్నారు. తెలంగాణ ప్రజల అసరాలను గుర్తించిన సీఎం కేసీఆర్ ఈ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని అన్నారు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఈ వెంకటరమణరెడ్డి, డీఈ సురేశ్, భక్తులు ఉన్నారు.

కాళేశ్వరంలో పూజలు..
కాళేశ్వర, ముక్తీశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామివారు ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఈవో మారుతి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగ తం పలికారు. అనంతరం ఆలయానికి చేరుకుని స్వామి వారి గర్భాలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అక్కడి నుంచి పార్వతి అమ్మవారి ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. అనంతరం స్వామి వార్ల కల్యాణ మండపంలో భక్తులకు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అర్చకులు, ఈవో స్వామి వారికి పండ్లు అందజేయగా, జెడ్పీటీసీ అరుణ, సర్పంచ్ వసంత, మాజీ చైర్మన్ బొమ్మర వెంకటేశం స్వామి వార్ల చిత్రపటం అందజేశారు.

55

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles