రెడ్డికాలనీ, అక్టోబర్ 13: మూడు రోజులుగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో చేపట్టిన పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆదివారం ముగిసింది. తెలంగాణ పోలీస్ విభాగంలోని వివిధ విభాగాల్లోని పోలీస్ కానిస్టేబుళ్లుగా తుదిరాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన జిరాక్స్ కాపీలతో పాటు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను పోలీస్ అధికారులు అభ్యర్థుల నుంచి స్వీకరించారు. మూడు రోజుల నుంచి చేపట్టిన ఈ పరిశీలన కార్యక్రమంలో 1252 అభ్యర్థులకు గాను 1126 మంది అభ్యర్థులు హాజరైనట్లు చెప్పారు. ఈనెల 18 నుంచి ఎంపికైన అభ్యర్థులకు నిర్ణయించిన తేదీల్లో వైద్య పరీక్షలు నిర్వహించబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ వెల్లడించారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 86 మంది గైర్హాజరు
వరంగల్ క్రైం, అక్టోబర్13 : కానిస్టేబుల్ ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 86 మంది గైర్హాజరైనట్లు కమిషనరేట్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 1252 మంది అభ్యర్ధులకు గానూ 1126 మంది అభ్యర్ధులు మాత్రమే కమిషనరేట్‌లోని మూడు రోజులు జరిగిన దృవకరణ పత్రాల పరిశీలనకు హాజరైనారు. ఈ నెల 18 నుంచి ఎంపికైన అభ్యర్దులకు వైద్యపరీక్షలు చేయనున్నారు.