అంతర్ కళాశాలల క్రీడోత్సవాలు ప్రారంభం


Mon,October 14, 2019 03:48 AM

మామునూరు, అక్టోబర్ 13 : ఐదో డివిజన్ బొల్లికుంటలోని వాగ్దేవి విద్యాసంస్థల క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న కేయూ పరిధిలోని అంతర్ కళాశాలల క్రీడోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. వాగ్దే వి వ్యాయామ విద్యా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా కాకతీయ విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి ప్రొఫెసర్ బీ సురేశ్‌లాల్ హాజరై మాట్లాడా రు. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని, శారీరక దృఢత్వం ఏర్పడుతుందని అన్నారు. అలాగే చేసే పని పట్ల పోటీ తత్వాన్ని పెంపొందింస్తుందని పేర్కొన్నారు. అనంతరం వాగ్దేవి విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి డాక్టర్ సీహెచ్ సత్యపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి అభివృద్ధి చేయడానికి క్రీడా, సాంస్కృతిక రంగాలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తామని అన్నారు.


విద్యార్థులు క్రీడా స్ఫూ ర్తిని చాటాలని సూచించారు. ఈ సందర్భంగా అతిథులు క్రీడాకారుల ఫ్లాగ్ మార్చ్ ద్వారా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విధ్యార్థులు ప్రదర్శించిన కోలాట నృత్యం అందరిని ఆకట్టుకుంది. కబడ్డీ, ఖోఖో, హ్యాండ్‌బాల్, సాఫ్ట్‌బాల్, బాల్ బ్యాడ్మింటన్ విభాగాల్లో జరిగే ఈ క్రీడలలో కేయూ పరిధిలోని కళాశాలల నుంచి 1300 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆతిథ్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ మొయిజ్ అహ్మద్, వాగ్దేవి డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ సుదర్శన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే సునీల్‌రెడ్డి, డాక్టర్ రమేశ్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ కళాశాలల నుంచి వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

42

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles