ప్రయాణం సాఫీగా!


Sun,October 13, 2019 01:38 AM

భూపాలపల్లి టౌన్‌, అక్టోబర్‌ 12 : జిల్లాలో ప్రయాణికుల ప్రయాణం సాఫీగా సాగుతోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆర్టీసీ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. శనివారం 40బస్సులు రోడ్డెక్కాయి. వీటితోపాటు ప్రవేట్‌ వాహనాలు ప్రయాణికులను గ్రామాలకు చేరవేస్తున్నాయి. ఇతర జిల్లాల నుంచి సైతం ప్రైవేట్‌ బస్సులు, టూరిస్టు బస్సులు భూపాలపల్లి నుంచి ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో ప్రైవేట్‌ వ్యక్తులతో మెయింటనెన్స్‌ సేవలు ప్రారంభమయ్యాయి. ఇక బస్సులు రూట్లలో ఆగకుండా కొనసాగుతున్నాయి. సమ్మె సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురుకాకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.


ప్రభుత్వ డిపార్టుమెంట్ల నుంచి..
ఆర్టీసీ సమ్మె సందర్భంగా డిపోలో ఆఫీసు పనులు సాఫీగా సాగేందుకు ఆయా ప్రభుత్వ డిపార్టుమెంట్ల నుంచి సిబ్బందిని రిక్రూట్‌ చేస్తున్నారు. ఎంపీడీవో, ఆర్టీవో, ట్రెజరీ తదితర డిపార్ట్‌మెంట్ల నుంచి సీనియర్‌ అసిస్టెంట్లను డిపోలో పనుల్లోకి డి ప్యూటేషన్‌పై తీసుకుని వినియోగించుకుంటున్నారు. అలాగే సింగరేణి సంస్థకు సైతం మ్యాన్‌పవర్‌ కోసం లెటర్‌ పెట్టారు. వ ర్క్‌షాప్‌లోని మెకానిక్‌లను, డ్రైవర్లను డిపోకు తాత్కాలిక పద్ధతిన అప్పగించాలని డీఎం లక్ష్మీధర్మ సింగరేణి అధికారులను కోరారు.

పోలీసుల బందోబస్తు..
ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు 144సెక్షన్‌ విధించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. అడిషనల్‌ ఎస్పీ రాజమహేంద్రనాయక్‌, డీఎస్పీ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సీఐ వాసుదేవరావు, ఎస్సైలు సాంబమూర్తి, రాకేశ్‌లు డిపో వద్ద నిత్యం పర్యవేక్షిస్తూ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

37

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles