పల్లె రూట్లలో ప్రైవేట్‌ పాఠశాలల బస్సులు


Sun,October 13, 2019 01:38 AM

- మెరుగుపడిన రవాణా సౌకర్యం
ఏటూరునాగారం, అక్టోబర్‌ 12 : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మారుమూల గ్రామాలకు వివిధ ప్రైవేట్‌ పాఠశాలల బస్సులను శనివారం నుంచి నడుపుతున్నారు. వాజేడు, వెంకటాపురం, కొండాయి, తుపాకులగూడెం గ్రామాలకు ప్రైవేట్‌ వాహనాలు నడిచాయి. కలెక్టర్‌ నారాయణరెడ్డి పాఠశాలల యాజమాన్యంతో శుక్రవారం సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాలకు బస్సులు నడిపించాలని యజమానులకు సూచించారు. దీంతో ములుగు జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల బస్సులను పలు మారుమూల ప్రాంతాలకు నడిపినట్లు ఆ పాఠశాలల యజమానుల సంఘం ములుగు జిల్లా కన్వీనర్‌ పెండ్యాల ప్రభాకర్‌ తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడంలో తాము కలెక్టర్‌ ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. పాఠశాలలు, కళాశాలల బస్సులు రంగంలోకి దిగి మారుమూల గ్రామాల ప్రయాణికులకు తమ వంతుగా సేవలందిస్తున్నట్లు వివరించారు. కాగా, ఉదయం నుంచి రాత్రి వరకు బస్సులు నడపడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. బతుకమ్మ, దసరా పండుగలకు పట్టణాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి రవాణా సౌకర్యం మెరుగుపడింది.

32

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles