వెంకటాపూర్/ గణపురం, అక్టోబర్11: కాకతీయుల శిల్పకళా సంపద అద్భుతంగా ఉన్నదని జాతీయ మహిళా కమిషన్ మెంబర్ శ్యామల ఎస్ కుందార్ ఐఏఎస్ చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప, కోటగుళ్లను ఆమె శుక్రవారం సందర్శించారు. ఆయా చోట్ల ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. రామప్ప చరిత్రను ఆలయ గైడ్ విజయ్‌కుమార్, కోటగుళ్లలో అధికారులు ప్రాశ్యస్థం, శిల్ప సంపద గొప్ప తనాన్ని వివరించారు. ఆయా శిల్పాలను చూసిన వారు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. కోటగుళ్ల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. రామప్ప ఆలయ చరిత్రను అందరికీ తెలిసేలా కృషి చేయాలన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చేలా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. రామప్ప దేవాలయంలో ఉన్న కాకతీయుల కట్టడాలు బాగున్నాయని కొనియాడారు. వెంట జిల్లా సంక్షేమాధికారి అవంతి, బీజేపీ నాయకులు చందుపట్ల కీర్తిరెడ్డి, ములుగు సీఐ దేవేందర్‌రెడ్డి, తహసీల్దార్లు దేవుళ్లపల్లి సమ్మయ్య, గుగులోత్ దేవాసింగ్, ఎంపీడీవో శ్రీధర్, ఎస్సై గోవర్దన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మైనంపెల్లి పాపయ్య, జిల్లా ఉపాధ్యక్షురాలు శోభ, ప్రధాన కారదర్శి సంపత్ తదితరులున్నారు.