ఆలిండియా వర్సిటీ క్రాస్ కంట్రీ పోటీలకు కేయూ మహిళల జట్టు


Thu,October 10, 2019 04:06 AM

రెడ్డికాలనీ, అక్టోబర్ 9: కాకతీయ యూనివర్సిటీ 2019-20 సంవత్సరానికి గాను ఆలిండియా ఇంటర్ వర్సిటీ క్రాస్ కంట్రీ టోర్నమెంట్‌కు కేయూ తరుపున మహిళల జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ బీ సురేశ్‌లాల్ తెలిపారు. ఈనెల 10న ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నంలో జరిగే పోటీలకు కేయూ నుంచి ఆరుగురు క్రీడాకారులు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఎం.కావ్య, ఎం.అరుణ, జే.సుష్మిత, జి.అర్చన, పి.కవిత, జి.వినోదను ఎంపికైనట్లు వీరికి మహబూబాబాద్ డిగ్రీ కళాశాల పీడీ కె.లలిత కోచ్-కమ్-మేనేజర్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. ఎంపికైన క్రీడాకారులను కేయూ వీసీ డాక్టర్ బి.జనార్ధ్దన్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే పురుషోత్తం అభినందించారు.

49

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles