బాలల భవితకు భరోసా

Sat,September 14, 2019 01:33 AM

-ఐదు జిల్లాల నుంచి 500పైగా అర్జీలు పరిష్కరించాలని
-విద్యాశాఖకు ఆదేశాలు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
-సభ్యురాలు ప్రజ్ఞా పరాండే

కలెక్టరేట్, సెప్టెంబర్ 13: బాలల భవితకు భరోసా ఇవ్వడమే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ లక్ష్యం ఆ కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞా పరాండే పేర్కొన్నారు. బాలల హక్కులకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటా మని స్పష్టం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేం ద్రంలోని సింగరేణి క్లబ్ హౌస్‌లో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో జయశంకర్ భూ పాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి శుక్రవారం శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌సీపీసీఆర్ సభ్యులు ప్రజ్ఞా పరాండే, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి, ఎస్పీ ఆర్ భాస్కరన్, జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలతతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞా పరాండే మాట్లాడుతూ 5 జిల్లాల్లో బాలల హక్కులపై దాడులకు సంబంధించి దాదాపు 500 పైగా ఆర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. అత్యవసరమైన కేసులను అక్కడికక్కడే సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించి, మిగతావి న్యూఢిల్లీకి తీసుకెళ్లి వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నా రు.

5 జిల్లాల నుంచి వచ్చిన బాలల హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదుల్లో ఎక్కువగా విద్యా సంస్థల్లో సరైన వసతులు లేవని, వైద్య సౌకర్యాలు బాలలకు సరిగ్గా అం దడం లేదని, వారి గ్రామాల సమస్యలు, పర్యావరణానికి సంబంధించిన అంశాలపై పిల్లలు ఫిర్యాదు చేశారని తెలిపా రు. పాఠశాలల్లో తాగునీటి సమస్యలను 3 రోజుల్లో, మరుగుదొడ్లు, పరిశుభ్రత సమస్యలను 7 రోజుల్లో, మౌలిక వసతుల కల్పన 3 నెలల్లో పూర్తి చేయాలని విద్యా శాఖను ఆదేశించామని చెప్పారు. పిల్లలతో భిక్షం ఎత్తించడం నేరమని, పిల్లలను అపహరించి, దివ్యాంగులను చేసి నగరాల్లో భిక్షాటన చేయించే వారు ఉన్నారని, వారితో పాటు తల్లిదండ్రులు పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న ఉదాంతాలు వెలుగులోకి వస్తున్నాయని గుర్తుచేశారు. జూన్ 10న సెంట్రల్ పార్క్‌లో అలాంటి 63 మంది పిల్లలను రక్షించి బాధ్యులైన తల్లిదండ్రులు, ఇతరులకు శిక్ష వేశామని, ఈ నెల 24న దేశ వ్యా ప్తంగా ఇదే విధంగా దాడులు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించినట్లు వివరించారు. వరంగల్ నగరంలో 9 నెలల చిన్నారిపై జరిగిన దురదృష్టకరమైన సంఘటనపై పోలీస్, బాలల సంరక్షణ అధికారులు వెంటనే స్పందించి నెల రోజుల్లోనే నిందితుడికి ఉరిశిక్ష పడేలా చూడడం ఆహ్వానించదగిన విషయమన్నారు.

బాలలపై అఘాయిత్యాలు చే సే వారికి ఇలాంటి తీర్పుతో భయం పెరుగుతుందని అభిప్రా యం వ్యక్తం చేశారు. స్వంత రాష్ట్రంలో బాలల హక్కుల కల్ప నకు ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందని పేర్కొ న్నారు. బాలల హక్కుల సంరక్షణకు ఏర్పాటైన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దేశ వ్యాప్తంగా బెంచ్‌లను ఏర్పాటు చేసి బాలల హక్కులు ఉల్లంఘనకు గురైతే బాధితులకు రక్షణ కల్పిస్తున్నదని, బాధ్యులకు శిక్షలు పడేలా చూస్తున్నదని వివరించారు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 5 జిల్లాల బాలల హక్కుల సంరక్షణపై భూపాలపల్లి జిల్లాలో క్యాంప్ నిర్వహించడం జిల్లాలోని బాలలకు ఉపయోగకరంగా ఉందని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు, అన్పిరేషనల్ జిల్లాకు కేటాయించే ప్రత్యేక నిధుల ద్వారా జిల్లా అభివృద్ధితో పాటు బాలలు స్వేచ్ఛగా జీవించేలా తీసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రాజమహేంద్రనాయక్, వరంగల్ ట్రైనీ కలెక్టర్ సంతోశ్, పెద్దపల్లి జేసీ ఎం. వనజాదేవి, ములుగు ఓఎస్‌డీ సురేష్, కాటారం ఏఎస్పీ సాయి చైతన్య, ఎన్‌సీపీసీఆర్ సభ్యులు సాయిష్టకేషా, బావనాబజాజ్, ప్రశాంత్, అన్షు, జిల్లా సంక్షేమ అధికారి శైలజ, 5 జిల్లాల అధికారులు, సంరక్షణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles