మహిళల సత్తా..!


Tue,January 22, 2019 02:19 AM

-టేకుమట్ల మండలంలో అతివలదే జోరు
-24 పంచాయతీల్లో 14 వారివే..
-4 ఏకగ్రీవాల్లో ముగ్గురు మహిళలే..
-అతి చిన్న, పెద్ద సర్పంచ్ కూడా మహిళలే..
టేకుమట్ల : పంచాయతీ ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. టేకుమట్ల మండలంలోని మొత్తం 24 గ్రామ పంచాయతీల్లో 14 పంచాయతీలను మహిళలు గెలుచుకుని సత్తా చాటారు. మండలంలో 24 జీపీల్లో 4 ఏకగ్రీవం కాగా అందులో ముగ్గురు మహిళలే ఉండడం విశేషం. ఇందులో పెద్దంపల్లి ఎస్సీ జనరల్ కేటాయించగా ఇద్దరు పురుషులతో పోటీ పడిన మహిళా అభ్యర్థి చిట్యాల వసంత విజయదుందుబీ మోగించారు. అలాగే పంగిడిపల్లిలో ఢిల్లీకి చెందిన సాఫ్ట్ ఇంజినీర్ ప్రి యాంక మహజన్ వినూత్న మ్యానిఫెస్టోతో వచ్చి ఏకగ్రీవ సర్పంచ్ గెలుపొందింది. అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుమ్మడవెల్లి సర్పంచ్ ఆకినపల్లి సంధ్య (24) మండలంలోనే చిన్న వయస్సుగల సర్పంచ్ గుర్తింపు పొందింది. అలాగే బూర్నపల్లి సర్పంచ్ గోపగాని లక్ష్మి(65) పెద్ద వయస్సుగల సర్పంచ్ ఎన్నికైంది. మొత్తం మీద టేకుమట్ల మండలం మహిళా సర్పంచ్ ముందంజలో ఉం

75

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles