టీబీ రహిత జిల్లాకు కృషి చేయాలి


Tue,January 22, 2019 02:18 AM

-డీఎంహెచ్ డాక్టర్ సధార్
ములుగుటౌన్, జనవరి21 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాను టీబీ రహిత జిల్లాగా చేసేందుకు కృషి చేయాలని డీఎంహెచ్ డాక్టర్ సధార్ అన్నారు. పట్టణకేంద్రంలోని ఏరియా దవాఖానలో సోమవారం జిల్లా టీబీ నియంత్రణాధికారి డాక్టర్ పోరిక రవీందర్ కలిసి టీబీనాట్ పరీక్ష వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో టీబీ వ్యాధి నివారణకు సీబీనాట్ వాహనాన్ని పంపించిందన్నారు. ఈ వాహనంలో ఉన్న మిషన్ ద్వారా ప్రత్యేక బృందం సభ్యులు గ్రామాల వారిగా తిరిగుతూ ప్రజలకు టీబీ పరీక్షలు చేస్తారని తెలిపారు. పరీక్షలు చేసిన వెంటనే వారికి టీబీ ఉందా లేదా అని కూడా అక్కడే నిర్థారించడం జరుగుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా చాలా మందిని టీబీ వ్యాధి నుంచి కాపాడటం జరుగుతుందని తెలిపారు. సోమవారం ఏటూరునాగారంలో వాహనంలోని పరీక్ష యంత్రం ద్వారా 70మందికి పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇందులో 12మందికి టీబీ లక్షణాలను ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వ్యాధి ఏ దశలో ఉందని తెలుసుకొని టీబీ వ్యాధి గ్రస్తులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు పౌష్టికాహార ఖర్చుల కోసం సైతం ప్రభుత్వం ద్వారా అందించే ఆర్థిక సాయాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా టీబీ జిల్లా నియంత్రణ అధికారి పోరిక రవీందర్ మాట్లాడుతూ నేడు గోవిందరావుపేట మండలంతో పాటు పస్రా గ్రామంలో ఈ పరీక్ష కేంద్రం ద్వారా ప్రజలకు టీబీ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని వైద్య బృందానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నిషన్ ఆవునూరి సారంగం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

70

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles