పంచాయతీల అభివృద్ధే సీఎం లక్ష్యం


Mon,January 21, 2019 01:33 AM

ఏటూరునాగారం, జనవరి 20 : గ్రామాలను సంపూర్ణంగా అభివృద్ధిపర్చాలనే ఆకాంక్షతోనే సీఎం కేసీఆర్ పంచాయతీకి మూడు కిలోమీటర్ల లోపు ఉండి, 500 జనాభా ఉన్న పల్లెలు, తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించడం జరిగిందని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. మండలకేంద్రలోని కాకుల మర్రి చక్రధర్‌రావు ఇంట్లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీల పరిస్థితిపై తాను ఆరా తీయడం జరిగిందన్నారు. జీపీలు ఏర్పాటు కావడం వల్ల అనేక మంది చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ కలలు నిజమయ్యాయని ఆయన పేర్కొన్నారు. స్థానికులు మంచి వ్యక్తిని గుర్తించి సర్పంచ్‌గా ఎన్నుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదని కోరారు. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ద్వారా రూ. 10 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని, దీంతో గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుం దన్నారు.


పంచాయతీల్లో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు వేయాలని, ఎల్‌ఈడీ లైట్లు కూడా వెలిగించాలనేది సీఎం కోరికగా ఆయన పేర్కొన్నారు. సర్పంచ్‌గా గెలిచిన వారు పార్టీ కండువా కప్పుకుని ముందుకు వస్తే సీఎం ఆశయం నెరవేరుతుందన్నారు. అయితే అనేక గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయం చేస్తుందని ఆయన దుయ్య బట్టారు. పోడు భూములను గుంజుకున్నట్లుగా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇది తగదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఎంపీ తెలిపారు. ఆ తర్వాత వాటికి రైతుబంధు పథకం కూడా వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సర్పంచ్‌లను గెలిపిస్తే ఇండ్లు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. తననియోజకవర్గంలో వెయ్యి ఇండ్లు కావాలని సీఎంను కోరడంజరిగిందని, ఇండ్లు లేని వారికి ప్రాధాన్యత ఇచ్చి మంజూరు చేస్తామని తెలిపారు.

ఎక్కెలను గ్రామ పంచాయతీగా చేయిస్తాం
ఏటూరునాగారం పంచాయతీ పరిధిలో నెలకొన్న ప్రత్యేక పంచాయతీ సమస్యను టీఆర్‌ఎస్ నాయకుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావు ఎంపీ దృష్టికి తీసుకపోయారు. అయితే మూడు కిలోమీటర్ల దూరం ఉంటే తప్పకుండా పంచాయతీ ఏర్పాటు చేస్తామని, ఎక్కెల, భూటారం గ్రామాలకు చెందిన గిరిజనులు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంపీ కోరారు. ఇదే విషయం తాను ప్రభుత్వం దృష్టికి తీసుకపోవడంతో పాటు అధికారులకు తెలియచేస్తానని హామీ ఇచ్చారు. జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు అండర్ వే నిర్మించాలని కూడా వివరించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు వలియాబీ, ఎంపీపీ మెహరున్నీసా, మాజీ సర్పంచ్ కాకులమర్రి చక్రధర్‌రావు, సర్పంచ్ అభ్యర్థి తూరం పద్మ, నాయకులు నూతి కృష్ణమూర్తి, కాకులమర్రి లక్ష్మణ్‌రావు, ప్రదీప్, వలిబాబా, కాకులమర్రి చిట్టిబాబు, ఎర్రబెల్లి మనోజ్, ఎజాజ్, సలీం పాషా, బాస పుల్లయ్య, తాడూరి రఘు, సలీం పాషా, తదితరులు పాల్గొన్నారు.

112

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles