సీఎంవోఏఐ భూపాలపల్లి నూతన కమిటీ సమావేశం


Mon,January 21, 2019 01:33 AM

భూపాలపల్లి, నమస్తే తెలంగాణ : కోల్‌మైన్స్ ఆఫీసర్స్ ఆఫ్ ఇండియా (సీఎంవోఏఐ) భూపాలపల్లి నూతన బ్రాంచి కమిటీ సదస్సు మొదటిసారిగా ఆదివారం స్థానిక ఇల్లందు క్లబ్‌లో ఏరియా కమిటీ అధ్యక్షుడు టీవీ రావు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథులుగా జీఎం గురువయ్య, పీ సత్తయ్య (జీఎం ఎన్విరాన్‌మెంట్ కార్పొరేట్) హాజరయ్యారు. ఈ నెల 27న సీఎంవోఏఐ కేంద్ర కమిటీ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో బ్రాంచి కమిటీ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రధానంగా ఎన్నికల నిర్వహణ, అదేవిధంగా లక్ష్యాలు.. వంటి తదితర విషయాలను సమావేశంలో చర్చించారు. అనంతరం జీఎంలు ఇద్దరు తమ సందేశాన్ని ఇచ్చారు. ఈ సదస్సులో ఇటీవల అన్ని ఏరియాల్లో నూతనంగా ఎన్నికైన ఆఫీస్ బేరర్స్ హాజరయ్యారు. ప్రధానంగా సమావేశంలో ప్రస్తుతమున్న కేంద్ర కమిటీ అధికారులకు పీఆర్పీ తేవడంలో వారి కృషి ఉందని సమావేశానికి హాజరైన వారు కొనియాడారు. మళ్లీ పాత కమిటీ నాయకత్వమే ఉంటే బాగుంటందనే అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ప్రభుత్వం, యాజమాన్యం, కార్మిక యూనియన్లతో స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉందని ప్రస్తుత కమిటీ సభ్యులు కలిగి ఉన్నారన్నారు.


ఈ కమిటీని ఎన్నుకుంటేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సదస్సులో ప్రస్తుత కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీ రాజశేఖర్, జాయింట్ సెక్రటరీ మంచాల శ్రీనివాస్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ సముద్రాల శ్రీనివాస్, భూపాలపల్లి ఏరియా బ్రాంచి కమిటీ నేతలు చిర్ర శ్రీనివాస్, శ్రీనివాస్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.

113

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles