ములుగుటౌన్, జనవరి 20: ములుగు పట్టణ కేంద్రానికి చెందిన సైకం హరిక శ్రీకాంత్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఖరారు అయ్యారు. పట్టభద్రురాలైన హారికరెడ్డిని ఆదివారం మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ ఖరారు చేశారు. హారికరెడ్డి అత్తమ్మ సైకం సుజాత ఈ నెల 16న మొదటి నామినేషన్ దాఖాలు చేయగా, హారిక 18న నామినేషన్ వేశారు. సమాజంపై అవగాహన కలిగి ఉండి సామాజిక సేవ చేసేందుకు ముందుకు వస్తున్న హారిక గెలుపునకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుండి కృషి చేయాలని చందూలాల్ కార్యకర్తలకు, నాయకులకు సూచించినట్లు తెలిసింది. ఏది ఏమైనా ములుగులో టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో దిగిన అభ్యర్థిరాలిని గెలిపించేందుకు గులాబీ దళం సిద్దమైంది. మాజీ మంత్రి చందూలాల్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ సైతం సర్పంచ్ అభ్యర్థి విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని ఉన్నత విద్యావంతురాలైన హరికకు టికెట్ కేటాయించడం పట్ల ప్రజలు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.