పోలింగ్ భారీ భద్రత : ఎస్పీ భాస్కరన్

Sun,January 20, 2019 01:43 AM

తొలి దశ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహణకు భారీ భద్రత ఏర్పాటు చేశాం. 1,300 మంది పోలీసులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ సారి పోలీసులకు తోడు అటవీ, ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు కూడా బందోబస్తులో భాగస్వాములవుతున్నారు. ఇప్పటికే స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు, సివిల్, టీఎస్ ఇతర విభాగాల పోలీసులు తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామాలకు చేరుకున్నారు. సోమవారం పోలింగ్ జరిగే గ్రామాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నాం. అత్యంత సమస్యాత్మకం, సమస్యాత్మకం, క్రిటికల్, మావోయిస్టుల ప్రభావిత గ్రామ పంచాయతీలను గుర్తించాం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రతీ గ్రామంలో నిఘా పెట్టాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రజలకు అవగాహన కల్పించాం. ప్రతీ పోలీస్ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశాం. ప్రధానంగా తొలిదశ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో మావోయిస్టుల ప్రభావం గల కన్నాయిగూడెం, ఏటూర్ మండలాల్లోని జీపీలు ఉన్నాయి. వీటిలో ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక దృష్టిసారించాం. ఇప్పటికే ప్రతీ గ్రామాన్ని పోలీసులు విజిట్ చేశారు. పరిస్థితులను తెలుసుకొని ఒక అంచనాకు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles