విద్యార్థినులకు అండగా షీటీమ్స్


Sat,January 19, 2019 01:26 AM

-సమస్యలపై ధైర్యంగా ఫిర్యాదు చేయండి
-అవగాహన సదస్సులో భూపాలపల్లి డీఎస్పీ కిరణ్
భూపాలపల్లి టౌన్, జనవరి 18: విద్యార్థినులు అభద్రతాభావాన్ని వదిలేయాలి.. సమస్యలపై ధైర్యంగా ఫిర్యాదు చేయండి.. మీకు అండగా షీ టీంలు ఉన్నాయి అని భూపాలపల్లి డీఎస్పీ కేఎం కిరణ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని దేవీ ఫంక్షన్ హాలులో సీఐ వేణు అధ్యక్షతన ఇంటర్, డిగ్రీ కళాశాలల విద్యార్థినులకు షీ టీంలపై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి డీఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో విద్యార్థినులు, మహిళలు పలురకాల వేధింపులకు గురవుతున్నా చాలా మంది బయటికి చెప్పుకోలేకపోతున్నారని, వారి కోసం ప్రభుత్వం షీ టీంలను ఏర్పాటు చేసిందని , హైదరాబాద్ షీ టీమ్స్ దేశవ్యాప్త గుర్తింపు, అవార్డులు వచ్చాయన్నారు. 100 నెంబర్ ఫోన్ చేసి మీ సమస్య చెప్పుకోవచ్చని, సమస్యను చెప్పుకున్నప్పుడే పరిష్కారానికి వీలవుతుందని తెలిపారు. రూరల్ ప్రాంతాల్లో 100 నెంబర్ కాల్ చేసిన 8.5 నిమిషాల్లో ఫిర్యాదుదారుడి వద్దకు పోలీసులు చేరుకుంటారని అన్నారు. జిల్లా కేంద్రంలోనూ షీ టీమ్స్ ఉన్నాయని, మీకు అండగా కొత్తగా మహిళా ఎస్సై నిహారిక ఇటీవలే నియమించబడిందన్నారు. విద్యార్థిణులు తమ సమస్యలను ఎస్సై నిహారికకు చెప్పుకోవచ్చన్నారు. పట్టుదలతో చదివి ఎస్సై ఉద్యోగాన్ని సాధించిన నిహారికను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థినులకు సూచించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పోలీస్ వ్యవస్థను అగ్రభాగాన నిలిపారని అన్నారు. హైదరాబాద్ స్వీడన్ పరికరాలతో రూ.25 కోట్లతో క్రైం ల్యాబ్ ఏర్పాటు చేశారని, ఇ ది దేశంలో రెండవదన్నారు. విద్యార్థులు లక్ష్యం ఎంచుకుని లక్ష్యసాధనకు కృషి చేయాలని, డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ ప్రిపేర్ కావాలని, పోలీస్ శాఖలో మీరంతా ఉ ద్యోగం సాధించాలని కోరారు. సీఐ వేణు మాట్లాడుతూ పోలీసుల సేవలు నిత్యం అందుబాటులో ఉంటాయని, భయంవీడి సమస్యల పై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమం లో ఎస్సైలు సాంబమూర్తి, నరేశ్, నిహారిక, తేజస్వినీ (గాంధీ) జూనియర్ కళాశాల కరస్పాండెంట్ రాజిరెడ్డి పాల్గొన్నారు.

77

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles