కేయూ దూర విద్య బీఈడీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం


Sat,January 19, 2019 01:26 AM

హన్మకొండ, నమస్తేతెలంగాణ: కాకతీయ విశ్వ విద్యాలయం దూర విద్య కేంద్రం అందిస్తున్న బీఈడీ కోర్సులకు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తూ టీటీసీ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లు కేయూ దూర విద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ జీ. వీరన్న తెలిపారు. 2018-19 విద్యా సంవత్సరానికిగాను దూర విద్య బీఈడీలో ప్రవేశాలను కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్ గుర్తింపు పొందిన టీటీసీ, డీఎడ్ పూర్తి చేసి ప్రాథమిక పాఠశాలల్లో ఇన్ పని చేస్తున్న ఉపాధ్యాయులు, బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇన్ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు అర్హులని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు డిగ్రీలో కనీసం 40శాతం మార్కులు సాధించి ఉండాలని తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో పని చేసే ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల ఉపాధ్యాయులు రెండేళ్ల బీఈడీ కోర్సులలో ప్రవేశాలు కల్పించనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు సర్వీస్ నిబంధనలను సడలించినట్లు ఆయన చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు డీఈవో, ఎంఈవోతో అటెస్ట్ చేయించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని తెలిపారు. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు జనవరి 31లోపు దూర విద్య కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కేయూ దూర విద్య కేంద్రం వెబ్ గాని, 0870-2438877, 2438899 నంబర్లలో గాని సంప్రదించాలని ఆయన కోరారు.

54

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles