మూడు పంచాయతీల్లో ఏకగ్రీవం


Fri,January 18, 2019 01:38 AM

- చండ్రుపట్ల, టేకులగూడెం, అయ్యవారిపేట గ్రామాల్లో సర్పంచ్‌ల ఏకగ్రీవం
- ధర్మవరం పంచాయతీలో నామినేషన్లు నిల్
వాజేడు, జనవరి 17 : మండలంలోని చండ్రుపట్ల, టేకులగూడెం, అయ్యవారిపేట పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. చండ్రుపట్ల పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా ఈర్ప సమక్క ,టేకులగూడెం గ్రామం నుంచి వాసం కృష్ణవేణి, అయ్యవారిపేటలో మడకం బెన్ని ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఈ మూడు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అదేవిధంగా ధర్మవరం గ్రామపంచాయతీలో ఒక్క నామినేషన్ దాఖలు కాకపోవడం గమనార్హం. కాగా మండలంలోని 17 పంచాయతీల్లో 77మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి నామినేషన్ వేయగా విత్‌డ్రాల అనంతరం 41 మంది బరిలో ఉండగా, 152 వార్డులకు 332మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో కూడావిత్‌డ్రాల అనంతరం 287 మంది వార్డు స్థానాల్లో బరిలో ఉన్నట్లు మండల ఎన్నికల అధికారి చంద్రశేఖర్ తెలిపారు.


అయ్యవారిపేటలో కలిసొచ్చిన రిజర్వేషన్
మండలంలోని అయ్యవారిపేట గ్రామ పంచాయతీ ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. అయితే గ్రామంలో ఎస్టీ అభ్యర్థులు లేకపోగా, గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ సద్దనపు నర్సింహాచారిని ప్రేమ వివాహం చేసుకున్న లక్ష్మీపురం గ్రామం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మడకం బెన్ని ఒకే ఒక్కరు ఇక్కడ ఎస్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో ఆమె సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

82

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles