పార్టీ శ్రేణులు సీరియస్‌గా పనిచేయాలి


Thu,January 17, 2019 01:50 AM

ఏటూరునాగారం: టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు సీరియస్‌గా పనిచేసి పంచాయతీ ఎన్నికల్లో పార్ట్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి చందూలాల్ పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో బుధవారం టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఏటూరునాగారం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పార్టీ తరపున గుర్రం కనకయ్య బరిలో ఉన్నప్పటికీ కొందరు టీఆర్‌ఎస్ పార్టీ పేరు వాడుకుంటూ వేరే అభ్యర్థిని బరిలోకి దించారని, కనకయ్యనే పార్టీ అభ్యర్థి అని ప్రజలు గుర్తించాల్సిందిగా మంత్రి స్పష్టం చేశారు. కనకయ్యను గెలిపించాలని కోరుతూ నాయకులు, వార్డు అభ్యర్థులతో మాట్లాడి వారిలో మనో ధైర్యాన్ని నింపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నదని తెలిపారు. కొందరు తమ స్వార్థం కోసం ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు తనకు వ్యతిరేకంగా పని చేశారని.. ఇప్పుడు కూడా పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. అలాంటి వారి విషయంలో ప్రజలు, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

త్వరలోనే బస్సుడిపోకు శంకుస్థాపన
త్వరలోనే మంత్రులతో ఇక్కడ బస్‌డిపోకు శంకుస్థాపన చేస్తామన్నారు. మరిన్ని అభివృద్ధి పనులు కూడా చేపడుతామన్నారు. పార్టీ బ్యానర్ పెట్టి కొందరు రాజకీయ ంచేయడం సిగ్గు చేటన్నారు. బెదిరింపులకు భయపడకుండా కార్యకర్తలు పనిచేయాలని చందులాల్ కోరారు. ప్రభుత్వం మనదేనని ఇద్దరు, ముగ్గురు మంత్రులు జిల్లా నుంచి ఉంటారని వారిని బస్‌డిపో శంకుస్థాపనకు తీసుకువస్తామన్నారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య, పార్టీ మండల అధ్యక్షుడు కూనూరు మహేశ్, నాయకులు తుమ్మ మల్లారెడ్డి, సర్దార్ పాషా, పెండ్యాల ప్రభాకర్, గడదాసు సునీల్ కుమార్, బట్టు కొంరయ్య, ఖాజాపాషా, ఎర్రల ఎల్లయ్య, కొప్పుల అనిత, బండి లక్ష్మీ, ఆకుల సాంబయ్య, తాహెర్‌పాషా, పర్వతాల రమేశ్, జాడి భోజారావు, కంకనాల రమేశ్, ఈసం స్వరూప, సరికొప్పుల వెంకటేశ్వర్లు, ఫర్తి నాయక్, సర్పంచ్ అభ్యర్థి కనకయ్య, వార్డు అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
ఏటూరునాగారం, రామన్నగూడెంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి చందులాల్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి విజయభాస్కర్‌రెడ్డి, బీజేపీ మండల కమిటీ మాజీ అధ్యక్షుడు కందకట్ల శ్రీనువాస్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు భిక్షపతి, సమ్మయ్య, నర్సింహారెడ్డి, గుంటి హరీష్, రాజన్న, గాడిచర్ల భిక్షపతి, కందుకూరి నీలకంఠం, రామన్నగూడెంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ ఎగ్గడి కోటయ్య, చిట్టం ఆదినారాయణ, పల్లా రాజేశ్వర్‌రావు, ఆకుల రోషయ్య, అల్లి శంకరయ్య, ముత్తినేని సత్యనారాయణ, సంగోజు మాధవచారి, బండి సత్యనారాయణ, అల్లి శ్రీనువాస్, కావాటి యాదగిరి, కోడి రాజమ్మతో పాటు సుమారు 150 మంది వరకు టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ మాజీ మంత్రి చందులాల్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.అనంతరం రామన్నగూడెంలో ఇటీవలే మృతి చెందిన రాందేని సత్యం కుటుంబాన్ని చందులాల్ పరామర్శించి ఓదార్చారు.

నలుగురి సస్పెన్షన్‌కు మండల కమిటీ తీర్మానం
టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గుర్రం కనకయ్యకు వ్యతిరేకంగా పనిచేస్తూ.. మరో అభ్యర్థిని నిలబెట్టి పార్టీ బ్యానర్‌ను వాడుకుంటున్న నలుగురిని సస్పెండ్ చేయాలని టీఆర్‌ఎస్ మండల పార్టీ ఈ మేరకు తీర్మానం చేసి.. కాపీని మాజీ మంత్రి చందూలాల్‌కు అందించింది. ఇదే కాపీని జిల్లా కమిటీ, అధిష్టానం వద్దకు పంపిస్తున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్ తెలిపారు. సీనియర్ నాయకుడు నూతి కృష్ణమూర్తి, జెడ్పీటీసీ వలియాబీ, మండల కో ఆప్షన్ సభ్యుడు వలిబాబా, పిట్టల నర్సయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానం చేశామని మహేశ్ తెలిపారు.

108

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles