స్థానిక పోరులో టీఆర్‌ఎస్‌దే విజయం


Thu,January 17, 2019 01:49 AM

రేగొండ: స్థానికి పోరులో గ్రామ గ్రామాన టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తారని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మంగళ, బుధవారాల్లో స్పీకర్ మండలంలోని గూడెపల్లే, రూపిరెడ్డిపల్ల్లె, దామరంచపల్ల్లె, సుల్తాన్‌పూర్, భాగిర్థిపేట తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభంజనం ఉందని, స్థానిక పోరులో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిస్తే.. గ్రామాలు మరింత అభివృద్ధ్ది చెందుతాయన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మోడెం ఉమేష్‌గౌడ్, కోల్గురి రాజేశ్వర్‌రావు, మైస భిక్షపతి, పున్నం రవి, మటిక సంతోష్, నీలాంబరం ఉన్నారు.


చెంచుపల్లెలో ముగ్గులపోటీలు
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంగళవారం మండలంలోని చెంచుపల్ల్లెలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మండలంలోని చెంచుపల్లె ఇటీవల నూతన పంచాయతీగా ఏర్పడగా.. ఇక్కడ సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ముగ్గ్గుల పోటీలు నిర్వహించారు.కార్యక్రమానికి స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరై .. బహుమతులు అందజేశారు. టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మోడెం ఉమేష్‌గౌడ్, నాయకులు పున్నం రవి, మైస భిక్షపతి తదితరులు ఉన్నారు.

86

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles