భారత్ దర్శన్‌కు మల్లయ్య ఎంపిక


Tue,January 15, 2019 05:05 AM

ఏటూరునాగారం, జనవరి 14 : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని కమ్మదనం జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాలలో ఈనెల 13న రాష్ట్ర స్థాయి వివిధ క్రీడలు సాహిత్య, సాంస్కృతిక అంశాల్లో భాగంగా అమ్మనాన్నల హల్‌చల్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గురుకులాల పూర్వ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పలు అంశాల్లో పోటీలు నిర్వహించారు. అమ్మనాన్నల హల్‌చల్ కార్యక్రమం లో భాగంగా చేపట్టిన క్విజ్ పోటీల్లో కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెం దిన గణితం ఉపాధ్యాయుడు కొయ్యడ మల్లయ్య పాల్గొని ద్వితీయ బహుమతిని సాధించారు. అంతేకాకుండా మల్లయ్య భారత్‌దర్శన్‌కు ఎంపికయ్యారు. ఈ మేరకు గురుకులాల సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు పీ నాగరాజు, బలరాం, సరిత, మానిక్యం, మనిబాబు, సతీశ్, విద్యా కమిటీ చైర్మన్ మంచాల సత్యనారాయణ తదితరులు అభినందనలు తెలిపారు.

88

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles