ముగిసిన మలిదశ విత్


Mon,January 14, 2019 01:54 AM

-అనూహ్య రీతిలో ఏకగ్రీవాలు
-33 పంచాయతీల సర్పంచుల ఏకగ్రీవ ఎన్నిక
-125 జీపీల సర్పంచులకే ఎన్నికలు
-ఏకగ్రీవమైన సర్పంచ్ అభ్యర్థుల సంబురాలు
-టీఆర్ మద్దతుదారులకు స్పీకర్ అభినందనలు
-రెండో విడత సర్పంచ్ 812, వార్డుకు 2675
-మూడు జీపీల్లో సర్పంచులకు సింగిల్ నామినేషన్
జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో కొందరు ఆదివారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో జిల్లాలో తొలి దశ ఎన్నికలు జరిగే 158 గ్రామ పంచాయతీల్లో 33 పంచాయతీల సర్పంచ్ స్థానాల ఎన్ని క ఏకగ్రీవం కావడం విశేషం. మిగse 125 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఈ నెల 21న ఎన్నికలు జరుగనున్నాయి. వీటితో పాటు అదే రోజు ఈ పంచాయతీల్లోని వార్డు స్థానాలకు కూడా అధికారులు ఎన్నికలు నిర్వహిస్తా రు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 21న తొలి దశ, 25న రెండో దశ, 30న మూడో దశ పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ఈ మేరకు తొలి విడత జిల్లాలో ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లోని 158 జీపీ లు, 1358 వార్డు స్థానాల్లో అభ్యర్థుల నుంచి ఈ నెల ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్ పత్రాలు స్వీకరించారు. తెల్లవారి పదో తేదీన నామినేషన్ పత్రాలను పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు సర్పంచ్, వార్డు స్థానాల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులకు ఉపసంహరణ కోసం అవకాశమిచ్చారు. ఈ మేరకు వివిధ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు పలువురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.


ఈ లెక్కన తొలి విడత ఎన్నిక లు జరిగే ఏడు మండలాల్లోని 158 గ్రామ పంచాయతీల్లో అనూహ్యంగా 33 జీపీల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తేలింది. ఉపసంహరణ తర్వాత సర్పంచ్ పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే మిగలడంతో 33 గ్రామ పం చాయతీల్లో సర్పంచుల ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు భావిస్తున్నారు. సర్పంచుల ఎన్నిక ఏకగ్రీవమైన 33 గ్రామ పంచాయతీల్లో కొన్ని జీపీల వార్డు స్థానాలకు 21న ఎన్నికలు జరుగనున్నాయి. ఎందుకంటే సదరు పంచాయతీల్లో వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోకుండా బరి లో ఉండటం వల్ల ఎన్నిక అనివార్యమైంది. ఇతర 125 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఈ నెల 21న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనుంది. అదే రోజు మధ్యా హ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు నిర్వహించి అధికారులు ఉపసర్పంచ్ ఎన్నిక జరుపుతారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన నేపథ్యంలో తొలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో పోటీ ఉన్న సర్పంచ్, వార్డు స్థానాల నుంచి బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ఆదివారం రాత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన 33 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్ అభ్యర్థులు, వారి మద్దతుదారులు సంబురాలు జరుపుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

మాజీ స్పీకర్ సిరికొండ అభినందనలు
తొలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థులకు ఆదివారం శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అభినందనలు తెలిపారు. భూపాలపల్లి మండలం నుంచి మూడు, చిట్యాల మండలంలోని ఏడు, టేకుమట్ల మండలంలోని నాలుగు, మొగుళ్లపల్లి మండలంలోని ఐదు, రేగొండ మండలంలోని ఎనిమిది, ఏటూర్ మండలంలోని ఒకటి, కన్నాయిగూడెం మండలంలోని ఐదు గ్రామ పంచాయతీల సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది టీఆర్ మద్దతుదారులు ఉన్నారు. వీరిని ఆదివారం మాజీ స్పీకర్ మధుసూదనాచారి స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొద్ది రోజుల నుంచి ఆయన పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పర్యటిస్తూ టీఆర్ మద్దతుదారులు సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి ప్రయత్నించి సఫలమయ్యారు. ఎన్నికలు జరిగే ఇతర గ్రామ పంచాయతీల్లోనూ సర్పంచ్, వార్డు స్థానాల్లో టీఆర్ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా మండలాల వారీగా పంచాయతీ ఎన్నికల కోసం టీఆర్ నుంచి ఇన్ నియమించారు.

రెండో దశ నామినేషన్లకు తెర
జిల్లాలో మరో ఏడు మండలాల్లోని 124 గ్రామ పంచాయతీల్లో రెండో దశ ఎన్నికలు జరుగనున్నాయి. వీటి కోసం 124 పంచాయతీలు, 1076 వార్డు స్థానా ల్లో సర్పంచ్, వార్డు సభ్యుల కోసం అధికారులు ఈ నెల 13 నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఆదివారం నామినేషన్ల స్వీకరణకు తెరపడింది. మూడురోజుల పాటు 124 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాల నుంచి పోటీకి దిగిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అధికారులు స్వీకరించారు. చివరి రోజు ఆదివారం నాటికి మొత్తం సర్పంచ్ 812, వార్డు అభ్యర్థులు 2675 మంది నామినేషన్లు వేశారు. పెద్దసంఖ్యలో స ర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు అయ్యా యి. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల కేంద్రాల్లోకి వచ్చిన అభ్యర్థుల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు అధికారులు నామినేషన్ పత్రాలను స్వీకరించారు. మల్హార్, కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్, పలిమెల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఈ నెల 25న రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నా యి. వెంకటాపురం మండలంలోని నూగూరు, రాచప ల్లి, తిప్పాపురం గ్రామ పంచాయతీల్లో మాత్రమే సర్పం చ్ స్థానాలకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఈ మూడు పంచాయతీల్లో సర్పంచుల ఎన్నిక ఏకగ్రీవమైనట్లు చెప్పవచ్చు. సోమవారం రెండో దశ ఎన్నికల కోసం సర్పంచ్, వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలిస్తారు.

102

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles