రెండోవిడత పోలింగ్ సిబ్బంది నియామకం


Mon,January 14, 2019 01:52 AM

-ఉమ్మడి జిల్లా ఎన్నికల పరిశీలకుడు రాహుల్
కలెక్టరేట్, జనవరి13 : ఈ నెల 25 న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల రెండోవిడత పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బంది కేటాయింపు ప్రక్రియను ర్యాండమైజేషన్ ద్వారా ఆదివారం సాయంత్రం వరంగల్ రూరల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ ప్రక్రియ ఉమ్మడి జిల్లాకు పంచాయతీ ఎన్నికల పరిశీలకుడిగా కేటాయించిన రాహుల్ పర్యవేక్షణలో నిర్వహించారు. వరంగల్ గ్రామీణ జిల్లాతోపాటు మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాకు కూడా రెండో విడత పోలింగ్ నిర్వహించడానికి ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందిని నియమించారు. వరంగల్ గ్రామీణ కలెక్టర్ ఎమ్ హరిత, మహబూబాబాద్ కలెక్టర్ శివలింగయ్య, భూపాలపల్లి జాయింట్ కలెక్టర్ కే స్వర్ణలత, ఆయా జిల్లాల పంచాయతీ అధికారులు ఏ రాజారావు, కే రంగాచారి హాజరయ్యారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో రెండో విడతలో ఈ నెల 25 న ఖానాపూర్, నల్లబెల్లి, పరకాల, నడికూడ, రాయపర్తి, శాయంపేట, మండలాల్లో పోలింగ్ జరుగనుంది. ఆయా మండలాలకు పీవోలుగా 1210 మందిని, ఓపీవోలుగా 2019 మందిని ఎన్నికల నిర్వహణకు కేటాయించారు. మహబూబాబాద్ జిల్లాలో రెండో విడతలో కురవి, డోర్నకల్, దంతాలపల్లి, మరిపెడ, చిన్నగూడూరు మండలాల్లో పోలింగ్ కోసం 2636 మంది సిబ్బందిని రిజర్వుతో కలిపి కేటాయించారు.
భూపాలపల్లి జిల్లాలో రెండో విడత పోలింగ్ కోసం 1553 మంది పీవోలు, 2802 మంది ఓపీవోలను కేటాయించారు.

49

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles