జలసౌధంపై హిమపాతం..


Sun,January 13, 2019 03:09 AM

గోవిందరావుపేట: లక్నవరం ప్రాంతంలో శనివారం ఉదయం పొగమంచు కురిసి సరస్సు ప్రాంతాన్నంతా హిమమయం చేసింది. సరస్సు వద్ద ఉన్న వేలాడే వంతెనలు, రెస్టారెంట్ సైతం మంచులో మునిగిపోయాయి. ఏజన్సీ ప్రాంతం మొత్తం పొగ మంచులో కమ్ముకుపోయింది. మంచు ప్రభావంతో 163 జాతీయరహదారిపై వాహన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. రహదారి సైతం కనపడకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో ఉండే ప్రజలు సైతం ఇంట్లో నుంచి బయటకు రాకుండా చలిమంటలు వేసుకుంటూ చలి ప్రభావం నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. ఏజన్సీలోని మల్లంపల్లి నుంచి గోవిందరావుపేట, ములుగు, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాలు సైతం మంచు ప్రభావంతో గజగజలాడాయి.

61

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles