651 నామినేషన్లు


Sun,January 13, 2019 01:21 AM

జయశంకర్ జిల్లాప్రతినిధి-నమస్తేతెలంగాణ: రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో శనివారం 651 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచ్ 205, వార్డులకు 446 దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. రెండు రోజుల్లో దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 872కు చేరింది. ఈ నెల 25న జిల్లాలో ఏడు మండలాల్లోని 124 గ్రామ పంచాయతీల్లో రెండో దశ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ పంచాయతీల్లో 1,076 వార్డులు ఉన్నాయి. శుక్రవారం నుంచి ఈ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. తొలి రోజు సర్పంచ్ 87, వార్డు స్థానాలకు 134 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండోరోజు శనివారం నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు పోటీపడ్డారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారు(ఆర్ క్లస్టర్లలో సర్పంచ్, వార్డు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. రెండోరోజు సర్పంచ్, వార్డు స్థానాల్లో కాటారం మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో అత్యధికంగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. అతి తక్కువ నామినేషన్లు వాజేడు మండలంలో దాఖలైనట్లు అధికారులు ప్రకటించారు. సర్పంచ్ మండలం వారీగా కాటారంలో 58, మహదేవ్ 27, మహాముత్తారంలో 53, మల్హర్ 40, పలిమెలలో 18, వెంకటాపురం(నూగూరు)లో 6, వాజేడులో 3 నామినేషన్ పత్రాలను స్పీకరించినట్లు వెల్లడించారు. వార్డు స్థానాలకు మండలం వారీగా కాటారంలో 131, మహదేవ్ 105, మహాముత్తారంలో 89, మల్హర్ 95, పలిమెలలో 5, వెంకటాపురంలో 16, వాజేడులో 5 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు.


మొత్తం 872 నామినేషన్లు
రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే గడువు ఆదివారం సాయంత్రం వరకు ముగియనుంది సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లోకి చేరుకున్న సర్పంచ్, వార్డు అభ్యర్థుల నుంచి ఆర్ నామినేషన్లు స్వీకరిస్తారు. చివరి రోజున నామినేషన్లు దాఖలు చేయడానికి సర్పంచ్, వార్డు అభ్యర్థులు క్లస్టర్లలో పోటెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ల స్వీకరణ సెంటర్ చేరుకున్న సర్పంచ్, వార్డు అభ్యర్థుల నుంచి రాత్రి పొద్దుపోయేవరకైనా నామినేషన్ పత్రాలు స్వీకరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రెండో విడతలో ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లోని 124 గ్రామ పంచాయతీల్లో తొలిరోజు శుక్రవారం సర్పంచ్ 87, వార్డు స్థానాలకు 134 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటికి శనివారం దాఖలైన నామినేషన్లను కలిపితే రెండు రోజుల్లో దాఖలైన నామినేషన్ల సంఖ్య 872కు చేరింది. రెండో దశ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ఆదివారం నామినేషన్ల స్వీకరణ ముగిసిన తర్వాత జిల్లాలో 30వ తేదీన మూడో విడత ఎన్నికలు జరిగే ఆరు మండలాల్లోని 133 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. అలాగే ఈ నెల 21న జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే 158 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో ఎవరైనా తమ నామినేషన్ ఉపసంహరించుకోవడానికి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు తుది గడువుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.

68

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles