రక్షణలో సింగరేణిని అగ్రగామిగా నిలపాలి


Sun,January 13, 2019 01:21 AM

-భూపాలపల్లి ఏరియా జీఎం గురువయ్య
గణపురం, జనవరి 12 : రక్షణ విషయంలో సింగరేణి అగ్రగామిగా నిలుపాలని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ గురువయ్య పిలుపునిచ్చారు. శనివారం బస్వరాజుపల్లి కెఎల్ గని సేఫ్టీ సభ్యులు, ఓవర్ సూపర్ స్పెషల్ ఫిట్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం గురువయ్య మాట్లాడుతూ కొంతకాలంగా సింగరేణి గనుల్లో జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ప్రమాదాలను నివారిస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించే లక్ష్యంగా భూపాలపల్లి ఏరియా గనుల్లో వర్క్ స్పెషల్ ఫిట్ సేఫ్టీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా శనివారం బస్వరాజుపల్లిలోని కేఎల్ కార్మికులకు అవగాహన కల్పింస్తున్నట్లు చెప్పారు.కార్మికులు రక్షణ సూత్రాలను పాటిస్తూ ఉత్పత్తి సాధించాలని,తమ వ్యక్తిగత రక్షణ కార్మిల బాధ్యత అని గుర్తు చేశారు.కార్మికులు చిన్న చిన్న పొరపాట్ల వల్ల పెద్ద మూల్యం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి, ప్రాతినిథ్యం సంఘం కార్యదర్శి మోటపోతుల రమేష్,కేఎల్ గ్రూప్ ఏజెంట్ టీవీ రావ్,ఏజీఎం(ఈ ఎండ్ ఎం) పరమేశ్వర్,ఏరియా రక్షణ అధికారి బచ్చు రవీందర్, గని మేనేజర్ తిరుపతి, సంక్షేమాధికారి సాధన్, రక్షణ అధికారి శ్రీధర్,కార్మికులు, సేఫ్టీ కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.

61

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles