రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి


Sun,January 13, 2019 01:20 AM

వాజేడు/రేగొండ: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా, మరో పదిమందికి గాయాలైన ఘటన జిల్లా వివిధ మండలాల్లో చోటు చేసుకుంది. వివరాలు.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన వాజేడు మండలంలో శనివారం చోటుచేసుకుంది. వాజేడు ఏఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. వాజేడు నుంచి మొరుమురుకు బైక్ వెళ్తున్న బోదెబోయిన సూర్యనారయణ(42)ను భద్రాచలం నుంచి బొగత జలపాతానికి మెదక్ జిల్లా నుంచి విహారయాత్రకు విద్యార్ధుతో వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ అరుణాచలపురం గ్రామ శివారులో ఢీకొట్టింది. దీంతో సూర్యనారాయణ కాలు విరిగి తలకు గాయమవగా, స్థానికులు 108 వాహనంలో అతడిని ఏటూరునాగారం వైద్యాశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సూర్యనారాయణ మృతిచెందినట్లు ఏఎస్సై తెలిపారు. మృతుడి సోదరుడు పాపారావు ఫిర్యాదు మేరకు బస్సుడ్రైవర్ వహిదుద్దీన్ కేసు నమోదు చేసి, మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. అదేవిధంగా మరో ఘటనలో రేగొండ మండలం రూపిరెడ్డిపల్ల్లె సమీపంలోని భారత్ పెట్రోల్ పంపు భూపాలపల్లి -పరకాల ప్రధాన రహదారిపై శనివారం తెల్లవారు జామున జరిగిన రోడు ప్రమాదంలో కారు డ్రెవ్ చేస్తున్న ప్రవీణ్ (22) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయా పాలైనట్లు ఎస్సై నాగపూరి సధాకర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. భూపాలపల్లికి చెందిన కుసుమవేణు, కంకణాల రమానాథరెడ్డి కారులో వరంగల్ నుంచి భూపాలపల్లికి వస్తున్న క్రమాంలో భూపాలపల్లి నుంచి పరకాలకు వెళ్తున్న లారీ రూపిరెడ్డిపల్లె సమీపంలో ఢీకొని ప్రవీణ్ మృతి చెందగా, వేణు, రమానాదరెడ్డికు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని దవాఖానకు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

51

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles