కాంటిజెన్సీ ఉద్యోగుల సమస్యల పరిష్కారాకి కృషి..


Mon,September 24, 2018 02:46 AM

-టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షుడు అశోక్
కృష్ణకాలనీ, సెప్టెంబర్ 23 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వివిధ మండలాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజులో 24 గంటలు పని చేస్తున్న కాంటి జెన్సీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారానికి టీఆర్‌ఎస్‌కేవీ కృషి చేస్తుందని టీఆర్‌ఎస్ కార్మిక విభాగం టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షుడు శానబోయిన అశోక్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థ్దానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర 24 గంటల పీహెచ్‌సీల కాంటిజెన్సీ ఉద్యోగుల యూనియన్ జిల్లా సమావేశాన్ని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మానేటీ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అశోక్ హాజరై మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖలో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పరిధిలో పనిచేస్తున్న కాంటిజెన్సీ ఉద్యోగులు అతితక్కువ వేతనాలతో పనిచేస్తున్నారన్నారు. రోజులో 8 గంటల మాత్రమే పనిచేసేందుకు అమలయ్యే విధంగా, ఉద్యోగ భద్రత కల్పించేం దుకు, కనీస వేతనాలు చెల్లించే విధంగా, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్లి కాంటీజెన్సీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి టీఆర్‌ఎస్‌కేవీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజ్‌కుమార్, రఫీ, సరోజన, సమ్మయ్య, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...