ఓటరు నమోదు వేగవంతం చేయాలి


Sun,September 23, 2018 02:45 AM

భూపాలపల్లి ఆర్డీవో వెంకటాచారి, ములుగు ఆర్డీవో రమాదేవి
భూపాలపల్లి, నమస్తే తెలంగాణ : ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని భూపాలపల్లి ఆర్డీవో వెంకటాచారి తహసీల్దార్‌లను ఆదేశించారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గ తహసీల్దార్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటరు జాబితాలో మరణించిన పేర్లు ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించి తొలగించాలన్నారు. అదేవిధంగా వివాహమై ఇతర ప్రాంతాలకు వెళ్లిన యువతుల పేర్లను కూడా ఓటరు జాబితా నుంచి తొలగించాలన్నారు. భూపాలపల్లి నియోజకర్గంలోని ఏడు మండలాలకు సంబంధించి నియోజకవర్గ కేంద్రం నుంచే ఎన్నికల నిర్వహణ ప్రక్రియను కొనసాగించాలని ఆర్డీవో ఆదేశించారు.
వెంకటాపూర్‌లో
వెంకటాపూర్ : ఓటరు నమోదును ప్రక్రియను వేగవంతం చేయాలని ములుగు ఆర్డీవో రమాదేవి అన్నారు. శనివారం మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామంలో ఓ టరు నమోదుపై అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె హాజరై మాట్లాడారు. యువతీ యువకులు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు అనేది సామాజిక భాధ్యతగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పోరిక దేవాసింగ్, వీఆర్వోలు, వీఆర్‌ఏలు పాలొన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...