ఓసీపీల్లో ప్రారంభమైన బొగ్గు ఉత్పత్తి

Sun,September 23, 2018 02:44 AM

భూపాలపల్లి, నమస్తే తెలంగాణ : భూపాలపల్లి ఏరియాలోని రెండు ఓసీపీ గనుల్లో శనివారం రెండో షిప్టు నుంచి బొగ్గు ఉత్పత్తి పునఃప్రారంభమైంది. వర్షం కురిసి కొంతమేర నీరు ఓసీపీ క్వారీల్లోకి చేరడం వల్ల గనుల పరిసర రోడ్లన్నీ పూర్తిగా బురదమయం కావడంతో శుక్రవారం మూడు షిప్టులు, శనివారం మొదటి షిప్టులో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. శుక్రవారం రాత్రి నుంచి వర్షం లేకపోవడంతో రోడ్లు వాహనాలు నడవడానికి అనుకూలంగా ఉండడంతో శనివారం రెండో షిప్టులో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రతి రోజు కేటీకే ఓపెన్‌కాస్ట్ సెక్టార్-1, సెక్టార్-2 గనుల్లో 5500 టన్నుల లక్ష్యానికి గానూ ఐదు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా వర్షంతో నిలిచిపోయిన మట్టి తవ్వకాలు కూడా ప్రారంభమయ్యాయి.

110
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles