గులాబీ దూకుడు

Fri,September 21, 2018 02:12 AM

- ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న టీఆర్‌ఎస్
- నర్సంపేట నుంచి ములుగుకు పదివేల మంది..
- పెద్ది నేతృత్వంలో దేవాదుల పనుల పరిశీలన
- ములుగులో సమావేశం, హాజరైన మంత్రులు
- భూపాలపల్లిలో ముఖ్యకార్యకర్తల సమావేశం
- అభివృద్ధికి నిరంతర పోరాటం : స్పీకర్ సిరికొండ
- గోదావరి జలాలతో రాష్ట్రం సస్యశ్యామలం: మంత్రి ఈటల రాజేందర్
- సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ: మంత్రి చందూలాల్
- ఇచ్చిన మాట నిలబెట్టుకున్నం..: ఎంపీ సీతారాంనాయక్
- జీవీఆర్‌కు సవాల్ విసిరిన రాజయ్యయాదవ్
- ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై వాసుదేవరెడ్డి ఫైర్
ఎన్నికల ప్రచారం వేడెక్కింది. గులాబీ శ్రేణులు దూకుడు పెంచాయి. తమ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. గురువారం ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ప్రచారం హోరెత్తింది. భూపాలపల్లిలోని ఏఎస్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. 2014ఎన్నికల్లో తనను దీవించిన ప్రజల కోసం నిరంతరం సేవకుడిలా పనిచేస్తున్నట్లు చెప్పారు. ములుగు లీలాగార్డెన్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈటల మాట్లాడుతూ.. గోదావరి జలాలతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కానుందన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వంద సీట్లు గెలవనుందని జోస్యం చెప్పారు. మంత్రి చందూలాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు నిరాటంకంగా కొనసాగాలంటే మరోసారి ఆశీర్వదించాలని కోరారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నుంచి దాదాపు పదివేల మంది టీఆర్‌ఎస్ శ్రేణులు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో ములుగుకు తరలివచ్చి దేవాదుల పనులను పరిశీలించారు. జిల్లాలో భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని వెంకటాపురం(నూగూరు) మండలంలో ఖమ్మం ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, భద్రాచలం టీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రావ్ ప్రచారం నిర్వహించారు.

(జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ) : శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని గు లాబీ శ్రేణులు దూకుడు పెంచారు. తమ పార్టీ అ భ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గురువారం ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ధూంధాంను తలపించారు. తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా చే సిన అభివృద్ధిపై నినదించారు. టీఆర్‌ఎస్ ప్రభు త్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ప్రతినబూనారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నుం చి దాదాపు 10వేల మంది టీఆర్‌ఎస్ శ్రేణులు ములుగుకు తరలివచ్చారు. నర్సంపేట నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో ఇక్కడికి చేరుకున్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని గ్రామాలను సస్యశ్యామలం చేసేందుకు ములుగు సమీపంలో రామప్ప చెరువు వద్ద తెలంగాణ ప్ర భుత్వం చేపట్టిన పంప్‌హౌస్, పైపులైన్ పనులను చూసి మురిసిపోయారు. త్వరలోనే ఈ పంప్‌హౌ స్, పైపులైన్ ద్వారా తమ భూములకు రామప్ప చెరువు నుంచి గోదావరి జలాలు వస్తాయని తెలుసుకుని సంబురపడ్డారు. మంత్రులు ఈటల రాజేందర్, అజ్మీరా చందూలాల్, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, సివిల్‌సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డితో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. మరి కొద్దిరోజుల్లో రామప్ప చెరువు నుంచి జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు నీరు పంపింగ్ ద్వారా నర్సంపేట నియోజకవర్గంలోని రంగాయచెరువు, పాకాలకు రానుందని ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. తెలంగాణలో అభివృద్ధి కొనసాగేందుకు మళ్లీ టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని గులాబీ శ్రేణులకు చెప్పారు.

భూపాలపల్లిలోని ఏఎస్‌ఆర్ గార్డెన్‌లో టీఆర్‌ఎస్ భూపాలపల్లి అర్బన్, మండల ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. టీఆర్‌ఎస్ అర్బన్ కమిటీ అధ్యక్షుడు సాంబమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో భూపాలపల్లి నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, గొర్రెల పెంపకందారుల సహకార సంస్థ చైర్మన్ కె.రాజయ్యయాదవ్, రాష్ట్ర వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఎస్.సమ్మారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి సంపూర్ణరవి, వైస్ చైర్మన్ గణపతి, ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, జెడ్పీటీసీ మీరాబాయి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మందల రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్, మండలంలోని కౌన్సిలర్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నేతలు, ముఖ్యకార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలో భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని వెంకటాపురం(నూగూరు) మండలంలో ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాచలం టీఆర్‌ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్ పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెల్లం వెంకట్రావ్ నేరుగా ఓటర్లను కలిసి భద్రాచలం నుంచి తనను ఆశీర్వదించాలని కోరారు. టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశాలతో జిల్లాలో శాసనసభా నియోజకవర్గ కేంద్రాలైన ములుగు, భూపాలపల్లి గులాబీమయం అయ్యాయి. ఇక్కడ టీఆర్‌ఎస్ శ్రేణులు గులాబీ జెండాలతో సందడి చేశారు. ధూంధాంలను తలపించేలా నినాదాలు చేశారు. భూపాలపల్లిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న గొర్రెల పెంపకందారుల సహకార సంస్థ చైర్మన్ రాజయ్యయాదవ్ తనదైన శైలీలో మాట్లాడి టీఆర్‌ఎస్ కార్యకర్తలను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డికి ఆయన సవాల్ విసిరారు.

నువ్వు నీ పార్టీ కార్యకర్తలను పేరు పెట్టి పిలువగలవా... లేదా స్పీకర్ మధుసూదనాచారి తన పార్టీ కార్యకర్తలను పేరు పిలుస్తాడా... చూద్దాం..నువ్వు నీ పార్టీ కార్యకర్తలను పేరు పెట్టి పిలిస్తే మధుసూదనాచారి పోటీ నుంచి తప్పుకుంటారు. లేదా మధుసూదనాచారి తన పార్టీ కార్యకర్తలను పేరు పెట్టి పిలిస్తే పోటీ నుంచి నువ్వు తప్పుకోవాలి. దీనికి సిద్ధమయితే నువ్వు ఏ ఊరైనా ఎంపిక చెయ్.. ఇది నా సవాల్ అంటూ వెంకటరమణారెడ్డిపై విరుచుకపడ్డారు. అంతేకాదు వెంకటరమణారెడ్డి కల్తీకి పాల్పడినట్లు ఆరోపించారు. పెట్రోల్‌బంకుల్లో వారితోనే కల్తీ మొదలైందని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీరుపై రాజయ్యయాదవ్ ధ్వజమెత్తారు. కేటీఆర్‌ను బచ్చా అంటున్నావు... వంశపారంపర్యం అంటున్నావు... ప్రపంచ దేశాలు ఆయన్ను తమ దేశాలకు ఆహ్వానిస్తున్నాయి..ప్రపంచ స్థాయి పారిశ్రామిక వేత్తలు కేటీఆర్‌ను కలిసి పరిశ్రమలు స్థాపిస్తామని అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ మాతో కలిసి వచ్చాడు.. ఖమ్మం జైలులో ఉన్నాడు.. ఆయనతో హరీశ్‌రావు కూడా ఉన్నాడు.. అందరు కేటీఆర్‌ను మెచ్చుకుంటున్నారు. రాహుల్ గాంధీని ఎవరు మెచ్చుకుంటున్నారు..?అని ఆయన ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ వంశపారంపర్యం కాదా.. ఆయన రాజీవ్‌గాంధీ కొడుకు కావటం వల్లే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యాడు...రాజీవ్‌గాంధీ తల్లి ఇందిరాగాంధీ కాదా.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఇవన్ని తెలియవా.. అవగాహన లేక మాట్లాడుతున్నాడా... ఆయన చరిత్ర చదవాల్సి ఉంది అని రాజయ్యయాదవ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. గొల్లకురుమలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.5వేల కోట్లతో గొల్లకురుమలకు 75శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. గొల్లకురుమలందరు కూడా టీఆర్‌ఎస్‌కే ఓట్లు వేస్తారని చెప్పారు.

వంద సీట్లలో గెలుపు : ఈటల
ములుగు నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ శ్రేణులు, రైతులతో పెద్ది సుదర్శన్‌రెడ్డి ములుగులో నిర్వహించిన సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, చందూలాల్, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్ హాజరయ్యారు. సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ త్వరలో రామప్ప చెరువు నుంచి ప్రతీ రోజు పాకాలకు 200క్యూసెక్కులు, రంగాయచెరువుకు 150క్యూసెక్కుల గోదావరి జలాలను తరలించనున్నట్లు ప్రకటించారు. రామప్ప చెరువులోకి వచ్చే గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా నర్సంపేట నియోజకవర్గంలోని రంగాయచెరువు, పాకాల జలాశయానికి తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.350కోట్లతో పనులు చేపట్టిందని గుర్తు చేశారు. ఎస్సారెస్పీ కాలువల పునరుద్ధరణ, దేవాదుల ప్రాజెక్టు ద్వారా మొత్తం 1.30లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వంద సీట్లలో గెలవనుందని ఈటల చెప్పారు.

106
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles