పట్టుదలతో పల్లెల అభివృద్ధి


Fri,September 21, 2018 02:10 AM

టేకుమట : అభివృద్దికి నోచుకోని పల్లెలను పట్టుదలతో అభివృద్ధి చేస్తున్నాని స్పీకర్ సిరికొండ మధుసూదానాచారి అన్నారు. గురువారం రామకృష్ణపూర్(టీ) దళిత కాలనీలోని బందెల రామచంద్రు ఇంట్లో పల్లె ప్రగతి నిద్ర చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌కు మహిళలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. స్పీకర్ కాలనీలో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కట్ల శ్రీను అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. రామకృష్ణపూర్(టీ) గ్రామానికి రూ. 17లక్షలతో శ్మశాన వాటిక, రూ.35లక్షలతో బీసీ కాలనీలో సీసీరోడ్లు నిర్మాణం, రూ.7లక్షలతో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామం మీదుగా డబుల్‌రోడ్డు , డ్రైనేజీ నిర్మాణం చేయించాన్నారు. టేకుమట్లను వ్యాపార, వాణిజ్య రంగాల్లో అభివృద్ధ్ది చేసి జిల్లాకు కేంద్ర బిందువు అయ్యేలా చేస్తాన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంపత్‌కుమార్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కత్తి సంపత్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, రైతు సమితి మండల కో ఆర్డినేటర్ కూర సురేందర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ సట్ల కొంరయ్య, కొలిపాక రాజయ్య, కమ్రోద్దిన్, టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు కట్ల శ్రీను, కట్ల లక్ష్మయ్య, ఎంబాడి రాజేందర్, మూత ఐలయ్య, గునిగంటి మహేందర్, రాజు, మల్లేశ్, అంబరుగొండ బుచ్చయ్య, మొగిళి, అచ్చె నిరంజన్, సంగి రవి, ఏకు మల్లేశ్, బీనవేని శంకర్‌గౌడ్, తోడేటి రవీందర్‌గౌడ్, గొల్లపల్లి సంతోశ్ గౌడ్, బందెల శ్రీను, ఎల్లస్వామి, వరదాచారి, నేరేళ్ల రామకృష్ణగౌడ్, పైడిపల్లి సతీశ్, అభిరాజ్, తోట సాగర్, ప్రభాకర్‌గౌడ్, శ్రీపాల్‌రెడ్డి, నేరేళ్ళ సు నీల్, శ్రీను, చేరాలు, శ్యాం సుందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...