అద్భుతంగా డబుల్ నిర్మాణాలు


Thu,September 20, 2018 04:58 AM

-జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత
-బుర్రకాయలగూడెం ఇళ్ల పరిశీలన
గణపురం, సెప్టెంబర్ 19 : రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు అద్భుతం గా ఉన్నాయని జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత అన్నారు. బుధవారం గణపురం మండలంలోని బుర్రకాయలగూడెంలో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నిర్మిస్తున్న 30డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఒక్కో ఇంటికి రూ.5.4లక్షలతో రాష్ట్రప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులు నిరంతర పర్యవేక్షణతో నాణ్యమైన ఇళ్లు నిర్మించుకునే విధంగా కృషి చేసిన కమిటీ సభ్యులను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. అనంతరం నిర్మాణాలు పూర్తయి ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను కా లినడకన గూడెంలో తిరుగుతూ పరిశీలించారు. త్వరలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసే విధంగా చూడాలని అధికారుకులకు సూచించారు. కార్యక్రమంలో ఆమె వెంట పీఆర్‌ఈ రాంబాబు, ఏఈ నరేశ్, డబుల్ బెడ్‌రూం స్పెషల్ ఆఫీసర్ కృష్ణమాచారి, సూపర్‌వైజర్, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు కాల్య బాబు, రామస్వామి తదితరలు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...