సమ్మయ్య కుటుంబానికి న్యాయం చేయాలి


Thu,September 20, 2018 04:58 AM

భూపాలపల్లి, నమస్తే తెలంగాణ : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు ఒంటేరు సమ్మయ్య కుటుంబానికి న్యాయం చేయాలని బుధవారం భూపాలపల్లి ఏరియా సింగరేణి ఆసుపత్రి ప్రధాన రహదారిపై సమ్మయ్య కుటుంబసభ్యులు, కార్మిక సంఘాల నాయకులు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు సమ్మయ్య మంగళవారం ఆర్జీఎఫ్ రక్షిత మంచినీటి సరఫరా చేసే వాటర్ ట్యాంక్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం విధితమే. ఈ క్రమంలో సమ్మయ్య కుటుంబంలో ఒకరికి సింగరేణి సంస్థ పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడంతో పాటు పరిహారం చెల్లించి తగు న్యాయం చేయాలన్నారు. ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సీఐ వేణు జీఎంకు ఫోన్‌లో వివరించారు. జీఎం గురువయ్య పర్సనల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్‌ను పంపించారు. చర్చలు జరిగినప్పటికీ సమస్య బుధవారం పొద్దుపోయే వరకు కూడా కొలిక్కి రాలేదు. ఈ విషయమై జీఎం గురువయ్యను నమస్తే తెలంగాణ వివరణ కోరగా సమ్మయ్య విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే మరణించాడని, అతను ప్రమాదం వల్ల మరణించాడా, లేక సహజ మరణమా అనే విషయమై పోస్టుమార్టమ్ నివేదిక వస్తేనే తెలుస్తుందన్నారు. ప్రమాదం సంభవించి మరణించినైట్లెతే సింగరేణి సంస్థ నిబంధనలను అనుసరించి కాంట్రాక్టర్ నుంచి పరిహారం ఇప్పించి అంతమొత్తం సదరు కాంట్రాక్టర్ బిల్లులో రికవరీ సంస్థ చేసుకుంటుందన్నారు. అదే సమయంలో కార్మిక శాఖ నుంచి కొంత పరిహారం వస్తుందన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...