గందరగోళం

Wed,September 12, 2018 03:25 AM

-ఎన్నికల పొత్తుకు ప్రతిపక్షాల నిర్ణయం
-తేలని సీట్ల కేటాయింపు వ్యవహారం
-భూపాలపల్లి స్థానాన్ని కోరుతున్న టీడీపీ
-ఇక్కడికి కొండా రావొచ్చనీ ప్రచారం
-ములుగులో అభ్యర్థిత్వానికి ఇద్దరు పోటీ
-సీతక్క, వీరయ్య వర్గీయులనడుమ వార్
-అభ్యర్థిత్వాల ఖరారు ఆలస్యమయ్యే అవకాశం
-కాంగ్రెస్ కేడర్‌లో తీవ్ర నైరాశ్యం
జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ :త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్‌ఎస్ సన్నద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల బరిలో నిలి చే తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ నెల 7వ తేదీన హుస్నాబాద్‌లో ఆశీర్వాద సభ ని ర్వహించి టీఆర్‌ఎస్ బాస్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రచారానికి సమరశంఖం పూరించారు. పార్టీ అధిష్టానం తమ పేర్లను ప్రకటించడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు నియోజకవర్గాలకు చేరుకున్నారు. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీంతో గులాబీ శ్రేణు లు కదన రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారం లో క్రమేనా దూకుడు పెంచుతున్నారు. తమ పా ర్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నా రు. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, కార్యకర్తలందరు కలిసి సమన్వయంతో ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలుపు తమదేనని ధీమా గులాబీ శ్రేణుల్లో కనబడుతోంది. భారీ సభలకు సైతం టీఆర్‌ఎస్ అభ్యర్థులు సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల్లో గందరగోళం చోటుచేసుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. పొత్తులు, సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఖరారు వంటి అంశాలపై ఇప్పటి వరకు క్లారిటీ లేకపోవడంతో టీఆర్‌ఎస్సేతర పార్టీల్లో అయోమయం నెలకొంది.

ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల కేడర్‌లో నైరాశ్యం ఆవరించింది. మరోసారి విజయఢంకా మోగించేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తుంటే టీఆర్‌ఎస్సేతర పార్టీల శ్రేణుల్లో అప్పుడే కలవరం మొదలైంది. నవంబర్‌లో జరిగే శాసనసభ ఎన్నికల కోసం టీఆర్‌ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ ఈ నెల 6వ తేదీన 105మంది పేర్లతో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. 50రోజుల్లో 100 సభలు నినాదంతో తెల్లవారి 7వ తేదీన సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్ ప్రజల ఆశీర్వాద సభ నిర్వహించారు. ఆయన ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో భూపాలపల్లి నుంచి శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ములుగు నుంచి మంత్రి చందూలాల్, మంథని నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌కు మరోసారి టీఆర్‌ఎస్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం దక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు కేటాయిస్తామన్న తన హామీని గు లాబీ బాస్ నిలబెట్టుకున్నారు.

అభ్యర్థిత్వాల ఖరారుతో భూపాలపల్లి, ములుగు, మంథని నుంచి అసెంబ్లీకి పోటీ చేసే టీఆర్‌ఎస్ అభ్యర్థులు మధుసూదనాచారి, చందూలాల్, పుట్ట మధూకర్ త మ నియోజకవర్గాలకు చేరుకుని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తమ నియోజకవర్గంలో ని పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల ప్రచార వ్యూ హాన్ని ఖరారు చేశారు. దీంతో గులాబీ శ్రేణులు ఊరూ రా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, అమల్లోకి తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మరోసారి ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు. మంథని టీఆర్‌ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్ ప్రచారంలో ఒక అడుగు ముందుకేసి గడప గడపకూ ప్రచారం చేపట్టారు.

తేలని సీట్ల కేటాయింపు..
ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ప్ర జలు ఆసక్తిగా ఉన్నారనే నిర్ణయానికి వచ్చిన ప్రతిపక్ష పార్టీలు ఎలాగైనా టీఆర్‌ఎస్‌ను ఓడించాలనే టార్గెట్‌తో పొత్తు కుదుర్చుకుని పోటీకి సిద్ధమయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జ నసమితి(టీజేఎస్) వంటి పార్టీల మధ్య అనైతిక పొత్తు పొడిచింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆత్మగౌర వం నినాదంతో ఆవిర్భవించిన టీడీపీ సైతం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని పోటీ చేయటానికి ముందుకు వచ్చింది. ఈ పార్టీల మధ్య సీట్ల కేటాయింపు అంశం ఇంకా తేలలేదు. టీడీపీ అడుగుతున్న సీట్లలో కొన్నింటిని వదులుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో వివిధ అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్సేతర పార్టీల నడుమ సీట్ల సర్దుబాటుపై పీఠముడి నెలకొంది.

తాజాగా టీడీపీ కోరుతున్న సీట్లలో జిల్లాలో భూపాలపల్లి నియోజకవర్గం కూడా ఉంది. ఈ స్థానం నుంచి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నాడు. తమ పార్టీలో బలమైన నేతల్లో ఒకరైన గండ్ర స్థానాన్ని వదులుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా లేదని తెలుస్తుంది. అయితే టీడీపీ భూపాలపల్లి సీటును కోరుతుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. గతం లో టీడీపీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేసిన గండ్ర సత్యనారాయణరావు గత నవంబర్‌లో టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరాడు. భూపాలపల్లి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం ఆశించాడు. గులా బీ బాస్, సీఎం కేసీఆర్ భూపాలపల్లి నుంచి స్పీ కర్ మధుసూదనాచారికే మరోసారి అవకాశం ఇచ్చారు. దీంతో తాను స్వతంత్ర అభ్యర్థిగా బరి లో ఉంటానని ప్రకటించిన గండ్ర సత్యనారాయణరావు ఈ నియోజకవర్గంలో ప్రచారం కూడా నిర్వహిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ కాంగ్రెస్ అధిష్టానం ముందు పెట్టిన సీట్ల జాబితాలో భూపాలపల్లి పేరు ఉండటం ఇక్కడ రాజకీయంగా ఆసక్తి రేపుతుంది. దీనికితోడు కొండా దంపతులు టీఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని, ఈ దంపతులు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్న సీట్లలో భూపాలపల్లి నియోజకవర్గం కూ డా ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది. తమకు రెండు అసెంబ్లీ స్థానాలను కేటాయించడానికి కాం గ్రెస్ సుముఖంగా ఉందనే కొండా దంపతులు టీఆర్‌ఎస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారనే ప్రచా రం జరుగుతున్న తరుణంలో ఈ దంపతులు వరంగల్ ఈస్ట్, పరకాల లేదా వరంగల్ ఈస్ట్, భూపాలపల్లి స్థానాలను తమకు కేటాయించాలని కాంగ్రెస్‌ను కోరినట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది.


అయితే పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ను టీడీపీ కోరుతున్న స్థానాల్లో వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట, పరకాల కూడా ఉన్నాయి. ప్రస్తుతం నర్సంపేటలో తాజా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమైనందున ఇక్కడ టీడీపీలో బలమైన నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డికి పరకాలలో సర్దుబాటు చేయవచ్చనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కొండా దంపతులు ప్రతిపాదించిన వరంగల్ ఈస్ట్‌తోపాటు భూపాలపల్లి స్థానాల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో పడవచ్చని, ఇందులో భాగంగా భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైన గండ్ర వెంకటరమణారెడ్డి పేరును వరంగల్ అర్బన్‌లోని వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించనుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో భూపాలపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ కేడర్‌లో అయోమయం నెలకొంది.

139
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles